Minister Venu Gopalakrishna Kneels down: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ. మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో మంత్రి వేణు గోపాల్ ఈ అనూహ్య చర్యకు పాల్పడ్డారు. శెట్టిబలిజలకు అండగా ఉంటున్న వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. వేదికపై వైవీ సుబ్బారెడ్డి ముందు మంత్రి హోదాలో ఉన్న వేణుగోపాల కృష్ణ ఇలా మోకరిల్లడం చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి గతేడాది కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అమలాపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం (ఏప్రిల్ 29) చిట్టబ్బాయి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి వేణు గోపాలకృష్ణ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన మంత్రి వేణు గోపాలకృష్ణ... సీఎం జగన్ రాష్ట్రంలోని శెట్టిబలిజల సంక్షేమ, అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. శెట్టిబలిజలకు అండగా ఉంటున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లారు.


మంత్రి వేణు గోపాలకృష్ణ ఇలా వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లడం స్వామి భక్తిని చాటుకోవడమేనని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. వేణు గోపాలకృష్ణ మాత్రం... తాను కృతజ్ఞతపూర్వకంగానే అలా చేశాను తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. 


కొద్దిరోజుల క్రితం జర్నలిస్టులను ఉద్దేశించి 'ఆరా తీయొద్దు... జగన్‌ను ఆరాధించండి... మీకు ఇళ్ల స్థలాలు ఆటోమేటిగ్గా వస్తాయి..' అంటూ వేణు గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. వేణు గోపాలకృష్ణ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారం మర్చిపోకముందే వేణు గోపాలకృష్ణ అందరి ముందు వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లడం తీవ్ర చర్చకు దారితీసింది. 


Also Read: Roja Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలతో రోజా భేటీ, కారణమేంటి


Also Read: Today Horoscope: ఇవాళ ఏప్రిల్ 30 సూర్యగ్రహణం..శని అమావాస్య, ఆ రాశులవారి పరిస్థితి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook