Roja Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలతో రోజా భేటీ, కారణమేంటి

Roja Tour: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రోజా తాజా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలను కలవడం ఆసక్తి రేపుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 30, 2022, 07:27 AM IST
 Roja Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలతో రోజా భేటీ, కారణమేంటి

Roja Tour: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రోజా తాజా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలను కలవడం ఆసక్తి రేపుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు కేటీఆర్ ఏపీ అభివృద్ధిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం, దానికి ఏపీ మంత్రులు దీటుగా కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఆ తరువాత కేటీఆర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూనే..తనకా ఉద్దేశ్యం లేదని ట్వీట్ చేశారు. అదే సమయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవిలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. మంత్రిగా బాథ్యతలు తీసుకున్న రోజాకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. రోజాను కేసీఆర్ దంపతులు సాంప్రదాయబద్ధంగా బొట్టుపెట్టి సత్కరించారు. రోజాతో పాటు ఆమె భర్త, ఇద్దరు పిల్లలున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రోజా..చిత్రపటాన్ని బహుకరించారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి కేసీఆర్‌ను కలవడం ఇదే. అటు కేసీఆర్ కుమార్తె కవితను కూడా రోజా కుటుంబసమేతంగా వెళ్లి కలుసుకున్నారు.

ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవిని కుటుంబసమేతంగా వెళ్లి కలుసుకున్నారు. రోజాను చిరంజీవి సగౌరవంగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లారు. రోజా చిరంజీవికి పూలగుఛ్చం బహుకరించగా..చిరంజీవి దుశ్సాలువాతో సత్కరించారు. సినీ పరిశ్రమ నుంచి ఏపీ రాజకీయాల్లో మంత్రిగా ఎదిగిన రోజాకు చిరంజీవి దంపతులు అభినందించారు. 

Also read: Jagan on Ramya Vedict: రమ్య హత్య కేసులో తీర్పుపై జగన్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News