AP Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడనం కాస్తా ఛత్తీస్‌గఢ్ వైపుకు కదలనుండటంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడు కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం వరకూ మరో ఉపరితల ద్రోణి ఏర్పడి ఉంది. ఫలితంగా రాష్ట్రంలో గాలులు పెద్దఎత్తున వీస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇంకా కొనసాగుతుండటంతో ఈ నెల అంటే సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం పడనుంది. శ్రీ సత్యసాయి , నంద్యాల, కడప, కర్నూలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


ఏపీలో వర్షపాతం వివరాలు


రాష్ట్రంలో రెండ్రోజుల్నించి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 15.4, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలసలో 14.8 , ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 68.7, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 51.8, పశ్చిమ గోదావరి జిల్లా నర్శాపరుంలో 47.8, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో 39.2, భీమవరంలో 26.2, ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజ్ వద్ద 30, ఏలూరు జిల్లా నూజివీడులో 22.8, కైకలూరులో 21.6, ఏలూరు జిల్లా పోలవరంలో 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. 


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కోస్తాంద్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. రానున్న 3 రోజులు ఏపీలో వర్షసూచన ఉందని తెలిపింది. 


Also read: BJP-JDS Alliance: దక్షిణాదిన మరో పొత్తు, ఎన్డీయేలో చేరనున్న జేడీఎస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook