చాలామంది భారతీయ పురుషులు మహిళలను తమతో సమానంగా భావించడంలేదు. స్త్రీలను చిన్నచూపు చూసే అలవాటు రూపుమాపాలి. మహిళల పట్ల పురుషులకు ఉన్న దృక్పథం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మహిళలు కూడా పురుషులకు సమానంగా శక్తిసామర్థ్యాలు కలిగినవాళ్లే. నేడు మహిళలు అన్ని రంగాల్లో రానిస్తున్నారు. పురుషులు చేసే అన్ని పనులు మహిళలు కూడా చేస్తున్నారు. అటువంటప్పుడు స్త్రీలను ఇంకా చిన్నచూపు చూడాల్సిన అవసరం ఏముందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నేడు కర్నూలు పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. అక్కడ విద్యార్థులతో జరిగిన ఓ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"174134","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]