Kakinada Mother Daughter Self Lockdown: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. చైనాలో కరోనా సునామీ కనిపిస్తోంది. నెట్టింట వైరల్ వీడియోలో వీధుల్లో మృతదేహాల కుప్పలు కనిపిస్తున్నాయి. మన దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఇదిలా ఉంటే.. ఏపీలో కాకినాడ జిల్లాలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఇద్దరు మహిళలు కోవిడ్-19 బారిన పడతారేమోననే భయంతో మూడేళ్లపాటు తమ ఇంట్లోని ఓ గదికే పరిమితమయ్యారు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన కాజులూరు కుయేరు గ్రామంలో చోటుచేసుకుంది. తల్లి, కూతురి పరిస్థితి విషమించడంతో భర్త అధికారులకు సమాచారం అందించగా.. ఇద్దరినీ కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలను తీసుకెళ్లేందుకు ఆరోగ్య సిబ్బంది అక్కడికి చేరుకోగా.. వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గది తలుపులు తీయడానికి నిరాకరించారు. ఆ తరువాత ఎలాగోలా మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఆమెను తలుపు తెరవమని ఒప్పించి.. వారిను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ మానసిక వ్యాధిగ్రస్తులుగా అనుమానిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.


కోవిడ్ విధ్వంసం తర్వాత 2020లో మణి, ఆమె కుమార్తె దుర్గా భవాని ఇంటి నాలుగు గోడల మధ్య సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. తర్వాత కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చినప్పటికీ, తల్లీకూతుళ్లు తమను తాము ఒంటరిగా ఉంచుకున్నారు. మణి భర్త వాళ్లకు ఆహారం, నీరు అందిస్తున్నాడు. కానీ గత వారం రోజులుగా ఆయనను కూడా వారు గదిలోకి రానివ్వడం లేదు. దీంతో ఈ విషయాన్ని అతున స్థానిక అధికారులకు చెప్పాడు. 


రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. గతేడాది జులైలో తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్‌ బారిన పడతామే భయంతో ముగ్గురు మహిళలు దాదాపు 15 నెలల పాటు తమ ఇంట్లోనే సెల్ఫ్‌ లాక్‌డౌన్ విధించుకున్నారు. గ్రామ వాలంటీర్ ప్రభుత్వ పథకం కింద నివాస స్థలం కోసం తన బొటన వేలిముద్రను ఆమోదించడానికి వెళ్లినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో మూడు నెలల క్రితం ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబంలో అన్న, ఇద్దరు చెల్లెళ్లు మూడేళ్లుగా ఇంట్లోనే లాక్‌డౌన్ విధించుకున్నారు. తల్లిదండ్రుల మృతితో ఈ ముగ్గురు మానసికంగా కుంగిపోగా.. జనాలతో దూరంగా ఉంటున్నారు. స్థానికులు సమాచారంతో అధికారులు వాళ్లను బయటకు రప్పించారు. 


Also Read: Delhi Liquor Scam: నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం.. కవితకు రాజగోపాల్ రెడ్డి రిప్లై  


Also Read: 7th Pay Commission: 18 నెలల పెండింగ్ డీఏపై కేంద్రం కీలక ప్రకటన.. రాజ్యసభలో ఏం చెప్పిందంటే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook