తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం చాలా మంది సెలబ్రిటీలలో చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టి కొందరు సెలబ్రిటీలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరికొందరు సెలబ్రిటీలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతూ వారిని సైతం కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. తాను నాటిన మొక్కలతో సెల్ఫీలు దిగారు. హీరో నందమూరి బాలకృష్ణ, సినీ నిర్మాత అశ్విన్ దత్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నట్లు తెలిపారు.


[[{"fid":"181006","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"రఘురామ కృష్ణంరాజు","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"రఘురామ కృష్ణంరాజు","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"రఘురామ కృష్ణంరాజు","class":"media-element file-default","data-delta":"2"}}]]


అనంతరం రఘురామ కృష్ణంరాజు మాట్లాడారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మొక్కలు లేనిది మానవాళి లేదు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ మహత్తర ఉద్యమంగా మారింది. తద్వారా బంగారు తెలంగాణ హరిత తెలంగాణగా మారుతోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటుగా తెలంగాణ పచ్చని తెలంగాణ కావాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నానని’ పేర్కొన్నారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..