MP Raghuramakrishnam Raju arrested on charges of sedition: హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ అరెస్ట్ జరిగింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రభుత్వంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఐపీసీ సెక్షన్ 124 -A, ఐపీసీ సెక్షన్ 153-B ప్రకారం వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రఘురామ కృష్ణం రాజును అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో అక్కడే భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ పోలీసులకు, సీఐడి పోలీసులకు వాగ్వీవాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో రఘురామ రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని మంగళగిరిలోని తమ కార్యాలయానికి తరలించినట్టు సమాచారం.


Also read : Sputnik V Vaccine Cost: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్


రఘురామకృష్ణం రాజు అరెస్టుకు సంబంధించిన నోటీసులు ఆయన కుటుంబసభ్యులకు అందచేసేందుకు ప్రయత్నించగా అవి తీసుకునేందుకు వారు తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ సీఐడి పోలీసులు అదే విషయాన్ని తెలియజేస్తూ అక్కడే ఇంటి గోడపై నోటీసులు అంటించినట్టుగా సమాచారం అందుతోంది.


గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (AP CM YS Jagan) రఘురామ కృష్ణం రాజు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్‌కి గతంలో సీబీఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ని రద్దు చేయాల్సిందిగా ఇటీవలే రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనియాంశమైంది. 


Also read: AP Ambulances: తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు స్టే, రాజ్యాంగ ఉల్లంఘన అంటూ వ్యాఖ్యలు


టీడీపీ చేతుల్లో రఘురామ కృష్ణం రాజు కీలుబొమ్మ: వైసీపీ
వైసీపీ టికెట్‌పై గెలిచిన రఘురామ కృష్ణ రాజు వైసీపీలోకి టీడీపీ పంపించిన కోవర్టు అని, అందుకే ఎంపీగా గెలిచిన అనంతరం తిరిగి టీడీపీకే వంతపాడుతున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేతిలో కీలుబొమ్మలా మారిన రఘురామ రాజు (YSRCP MP Raghurama Krishnam Raju) ఆయన ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook