దేశంలో ఇదివరకే రెండు కరోనా వ్యాక్సిన్లకు పూర్తి స్థాయిలో ఆమోదం రావడంతో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు విజయంతంగా పంపిణీ చేస్తున్నారు. అయితే కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెండం, భారీగా కరోనా మరణాలు నమోదు అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం, డీసీజీఐ మరో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గత నెలలో ఆమోదం తెలిపింది. తాజాగా రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది.
రష్యా శాస్త్రవేత్తలు రూపొందించిన స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ సైతం భారత్‌లో అందుబాటులోకి రానుంది. డాక్టర్ రెడ్డీస్ దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధరలను శుక్రవారం నాడు ప్రకటించారు. స్పూత్నిక్ వి కోవిడ్19 వ్యాక్సిన్ ధర (Sputnik V Vaccine Cost) రూ.948 + 5% GST గా నిర్ణయించారు. ఓవరాల్‌గా చూస్తే స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర రూ.995.40కు అందుబాటులోకి రానుంది. విదేశాలలో రష్యా వ్యాక్సిన్‌ను 10 డాలర్ల ధరకు విక్రయిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తొలి డోసు టీకాలను నేడు ప్రారంభించారు.
Also Read: PM Kisan Samman Nidhi Status: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ, PM Kisan స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Imported doses of Sputnik V #COVID19 vaccine are presently priced at Rs 948 + 5% GST per dose, with the possibility of a lower price point when local supply begins: Dr. Reddy’s Laboratories pic.twitter.com/bEowM6ZhZY
— ANI (@ANI) May 14, 2021
దేశంలో ప్రస్తుతం ప్రారంభించిన టీకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. త్వరలోనే డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరిస్ వీటిని దేశీయంగా ఉత్పత్తి చేసి పంపిణీ చేయనుంది. హైదరాబాద్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ తొలి టీకాను ఇచ్చినట్లు రెడ్డీస్ ల్యాబ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ నెలలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపడం తెలిసిందే. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల కన్నా విదేశీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ధర అధికంగా ఉండటంతో కొనుగోళ్లు ఏ మేర ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook