ప్రభుత్వ నిర్ణయం వెనక ఏదైనా కుట్ర ఉందా... అనుమానం వ్యక్తం చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు...
MP Rammohan Naidu: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. దీని వెనక ఏదైనా కుట్ర ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. వికేంద్రీకరణ బిల్లును పూర్తిగా రద్దు చేసేంతవరకూ రైతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.
MP Rammohan Naidu: మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం మరో నాటకమే తప్ప రైతులకు న్యాయం చేసే ఉద్దేశం ఎక్కడా కనిపించట్లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ బిల్లును ఉపసంహరించుకోవడం వెనక ఏదైనా కుట్ర ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. వికేంద్రీకరణ బిల్లును పూర్తిగా రద్దు చేసేంతవరకూ రైతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. అమరావతి రైతులకు (Amaravati farmers) ఏవిధంగా న్యాయం చేయబోతున్నారు... అమరావతిని ఎలా అభివృద్ది చేయబోతున్నారనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా హత్య, రాష్ట్రంలో వర్ష బీభత్సం, ఇలా పలు అంశాలపై జరుగుతున్న చర్చలను ప్రభుత్వం డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) ఆరోపించారు. ఓవైపు వర్షాలు, వరదలతో రాష్ట్రం విపత్తును ఎదుర్కొంటుంటే... ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) పెళ్లిళ్లకు హాజరవడమేంటని ప్రశ్నించారు. జగన్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతున్నాయని విమర్శించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల వ్యాఖ్యలు దారుణమని... సీఎం జగన్‌కు నిజంగా మహిళలపై గౌరవం ఉంటే వైసీపీ నేతలతో చంద్రబాబుకు క్షమాపణలు చెప్పించాలన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబుకు ఎదురైన అవమానం వెనక జగన్ పాత్ర ఉందన్నారు.
చంద్రబాబును (Chandrababu Naidu) మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అందుకోసం ఎన్ని కేసులైనా, అరాచకాలైనా ఎదుర్కొంటామన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్.. వైసీపీ నేతలను మరింత ప్రోత్సహించేలా వ్యవహరించారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తినా తాము గెలిపించిందని ఆమదాలవలస ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతి విషయంలో టీడీపీ మొదటి నుంచి పోరాడుతోందని... ఇక ముందు కూడా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read: ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే వచ్చేది వేర్పాటు వాదమే, మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ అవసరాన్ని, మూడు రాజధానుల ఏర్పాటులో ప్రభుత్వ సదుద్దేశాన్ని మరింత విపులంగా, విస్తృతంగా వివరించేందుకే ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మరింత సమగ్రమైన బిల్లుతో సభ ముందుకు వస్తామని వెల్లడించారు. దీంతో మూడు రాజధానుల (AP Three Capital Bill) విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook