Mudragda Padmanabham letter to CM Jagan: ఏపీలో సంక్రాంతి (Sankranti 2021) అనగానే  కోడి పందాలు (Cock fight) గుర్తొస్తాయి. కోడి పందాలు వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం తరలి వెళ్తుంటారు. మరోవైపు, కోడి పందాలకు ప్రభుత్వ అనుమతి లేని కారణంగా పోలీసులు వాటిని అడ్డుకోవడం పరిపాటిగా మారింది. ప్రతీ ఏటా సంక్రాంతి పండగ పూట కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేయడం... పలువురిని అరెస్ట్ చేసి కేసులు పెట్టడం జరుగుతోంది. అయితే ప్రజాభీష్ఠాన్ని అర్థం చేసుకుని పండగ పూట కోడి పందాలకు ప్రభుత్వం అనుమతినివ్వాలనే డిమాండ్ కూడా చాలాకాలంగా ఉంది. తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'చాలా సున్నితమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గ్రామాల్లో సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎడ్లు, గుర్రం, కోడి పందాలు, గోలీలు ఆడుకోవడం, ఎడ్లు బరువు లాగే పందాలు, ఆటల పోటీలు, జాతర వగైరాలతో సుమారు 5 రోజులు పండగ జరుపుకుంటారు. ఈ మధ్య కాలంలో పండగ ఉత్సవాల్లో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.' అని ముద్రగడ (Mudragada Padmanabham) తన లేఖలో పేర్కొన్నారు.


'సంక్రాంతి, ఉగాది పండగ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 5 రోజుల చొప్పున పర్మిషన్‌కి పర్మినెంట్ ఆర్డర్స్ ఇప్పించాలని కోరుతున్నాను. కోడి పందాలు జల్లికట్టు కన్న ప్రమాదకరమైన ఆటలు, సంబరాలు కావండి. దయచేసి పండగలకు ప్రజలను జైలుకు తీసుకెళ్లే పరిస్థితి లేకుండా చేయండి.' అని ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ముద్రగడ విజ్ఞప్తిపై సీఎం జగన్ (CM Jagan) ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Also Read: Video: విజయ్ దేవరకొండ-రష్మిక డిన్నర్ డేట్... ఇలా కెమెరాకు దొరికిపోయారు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook