Video: విజయ్ దేవరకొండ-రష్మిక డిన్నర్ డేట్... ఇలా కెమెరాకు దొరికిపోయారు..

Vijay devarakonda and rashmika mandanna dinner date: ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకొస్తూ విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ కెమెరాలకు చిక్కారు. ఆదివారం (డిసెంబర్ 19) రాత్రి ఇద్దరు కలిసి ఆ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 05:13 PM IST
  • ముంబైలో కెమెరాలకు చిక్కిన విజయ్-రష్మిక జోడీ
  • డిన్నర్ డేట్‌కి వెళ్లిన విజయ్ రష్మిక జంట
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Video: విజయ్ దేవరకొండ-రష్మిక డిన్నర్ డేట్... ఇలా కెమెరాకు దొరికిపోయారు..

Vijay devarakonda and rashmika mandanna dinner date: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందనే గాసిప్స్ చాలా కాలంగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తమ మధ్య రిలేషిన్‌షిప్‌పై ఇప్పటికైతే ఇద్దరిలో ఎవరూ ఓపెన్ అవలేదు. అయితే అడపాదడపా ఇద్దరు కలిసి కెమెరాలకు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా ముంబైలో (Mumbai) ఈ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది.

ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకొస్తూ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక (Rashmika Mandanna) జోడీ కెమెరాలకు చిక్కారు. ఆదివారం (డిసెంబర్ 19) రాత్రి ఇద్దరు కలిసి ఆ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొదట విజయ్ దేవరకొండ రెస్టారెంట్ నుంచి బయటకొచ్చి కారులో కూర్చోగా... అతని వెనకాలే రష్మిక కూడా వచ్చి కారులో ఎక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ జోడీని బాలీవుడ్ జోడీ రణబీర్ కపూర్-అలియా భట్‌తో (Ranbir Kapoor-Alia Bhat) పోల్చారు. 'ఓ మై గాడ్... క్రష్మిక అండ్ లవ్‌కొండ.. ఈ సౌత్ జంట అలియా-రణబీర్‌లను మరపిస్తున్నారు...' అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ 'ఎప్పటికీ బెస్ట్ జోడీ...' అని కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్... 'ఇద్దరి ప్రేమాయణాన్ని అధికారికంగా ప్రకటించేశారా...' అని ఆరా తీసే ప్రయత్నం చేశాడు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా (Vijay Rashmika) కలిసి 2018లో గీత గోవిందం, 2019లో డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా గీత గోవిందం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇద్దరి జోడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా నుంచే ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో (Liger) నటిస్తున్నాడు. అటు రష్మిక కూడా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సిద్దార్థ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతోన్న మిషన్ మజ్నులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. శాంతను బాగ్చి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

Also Read: Bank Holiday Alert: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్-డిసెంబర్ చివరి 10 రోజుల్లో ఆరు రోజులు సెలవులే!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News