Murder Attempt: ఏపీలోని సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఇవాళ మద్యాహ్నం హత్యాయత్నం జరిగింది. దుండగుడు విసిరిన బాంబు పేలకపోవడంతో ఎమ్మెల్యే ప్రాణాలతో బయటపడ్డారు. అసలేం జరిగిందంటే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని గోరంట్లలో వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణ అభిమానులు, అనుచరులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాత్రం సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఒక్కసారిగా ఎమ్మెల్యేపై బాంబు విసిరాడు. అదృష్టవశాత్తూ బాంబు పేలకపోవడంతో ఎమ్మెల్యే శంకర నారాయణకు ప్రాణాపాయం తప్పింది. 


ఎమ్మెల్యే శంకర నారాయణపై ఆ దుండగుడు విసిరింది ఎలక్ట్రికల్ డిటొనేటర్‌గా పోలీసులు గుర్తించారు. పవర్ సప్లై లేకపోవడంతో పేలలేదని గుర్తించారు. మద్యం మత్తులో డిటొనేటర్ విసిరినట్టు భావిస్తున్నామని గోరంట్ల పోలీసులు తెలిపారు. దుండగుడిని గణేష్‌గా గుర్తించామని స్థానిక సోమందేపల్లి మండలానికి చెందిన వ్యక్తి అని చెప్పారు. ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


ఈ ఘటనపై ఎమ్మెల్యే శంకర నారాయణ స్పందించారు. తనపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేల్చాలని కోరారు. కుట్ర కోణాన్ని పోలీసులు త్వరగా ఛేదించాలని డిమాండ్ చేశారు. భగవంతుడి దయతో ప్రాణాలతో బయటపడ్డానని, డిటొనేటర్ పేలి ఉంటే ఘోరం జరిగుండేదని చెప్పారు. ప్రజల్లో తనకు లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఈ దాడికి పాల్పడినట్టుగా ఎమ్మెల్యే శంకర నారాయణ తెలిపారు. 


Also read: Crucial Monday: చంద్రబాబు కేసుల్లో రేపు సోమవారం అత్యంత కీలకం, ఏం జరగనుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook