Flight Emergency Landing: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఆ వివరాలివీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరి అధికార పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న రాజమండ్రి చేరుకున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఇండిగో విమానం(Indigo Flight)ద్వారా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్(Rajahmudry Airport)నుంచి తిరుపతికి పయనమయ్యారు. అయితే తిరుపతి సమీపంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రేణిగుంటలో ల్యాండ్ కావల్సిన విమానం దాదాపు గంటసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఎంతకీ క్లియర్ కాకపోవడంతో బెంగళూరు విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 


ఇండియా విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు 70 మంది ప్రయాణీకులున్నారు. పైలట్ సురక్షితంగా బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ విమానంలో రోజాతో పాటు టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు. బెంగళూరులో దిగిన ప్రయాణీకులు..అక్కడి నుంచి తిరుపతికి పయనమయ్యారు. విమానంలో సాంకేతికలోపం ఎలా తలెత్తిందనే విషయంపై అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయాన్ని స్వయంగా సినీ నటి రోజా(MLA Roja) సెల్ఫీ వీడియో తీసి విడుదల చేశారు. 


Also read: YS Vivekananda Murder Case: ప్రాణ హాని ఉందంటూ కడప ఎస్పీకి వివేకా పీఏ ఫిర్యాదు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook