Nandamuri Family Donation: ఈసారి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. విజయవాడ లోని బుడమేరు పొంగడంతో గుంటూరు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలతో సహా అక్కడున్న పలు చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం అయ్యాయి.  పిల్లల్ని మొదలుకొని వృద్ధుల వరకు.. చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో తినడానికి తిండి లేక,  తాగడానికి నీరు లేక,  ఆకలితో అలమటించారు. కొంతమంది ఏకంగా ప్రాణాలు వదిలారు కూడా. అయితే వీరిని కాపాడడం కోసం,  ఆదుకోవడానికి అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది సెలబ్రిటీలు , వ్యాపారవేత్తలు,  రాజకీయ నాయకులు ముందుకొచ్చి తమ వంతు సహాయంగా విరాళాలు ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఒక్క సినిమా ఇండస్ట్రీ నుంచి ఏకంగా రూ.20 కోట్లకు పైగా విరాళాలు అందాయి. అలాగే కొంతమంది యంగ్ హీరోయిన్లు, యంగ్ యాంకర్లు కూడా  ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. ఇక ప్రజలు అయితే చాలామంది బియ్యం, బట్టలు,  నిత్యవసర సరుకులు కూడా సరఫరా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకరు నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక అడుగు ముందుకేసి 25 లక్షల రూపాయల.. చెక్కును నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి అందజేశారు. 


ఆయన ఎవరో కాదు నందమూరి మోహనకృష్ణ. దివంగత నటులు, రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు వారసుడు మోహనకృష్ణ తోపాటు ఆయన కుమార్తె  నందమూరి మోహన్ రూప నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి 25 లక్షల రూపాయల చెక్ అందజేశారు. వారి మంచి మనసుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. 


గతంలో కూడా నందమూరి మోహన్ కృష్ణ అలాగా ఆయన కూతురు నందమూరి మోహన్ రూపా కూడా చాలామందికి సహాయం చేశారు. టిటిడి అన్నదాన ట్రస్ట్ కి కూడా విరాళాలు ప్రకటించారు. మరొకవైపు నందమూరి మోహన్ రూప గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాలలో టిడిపి పార్టీ తరఫున జోరుగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.



నందమూరి మోహన్ కృష్ణ విషయానికి వస్తే.. ఫిలిం ఇండస్ట్రీలో చదువుకునే సమయంలోనే ఆయన గోల్డ్ మెడలిస్ట్. అంతేకాదు తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన అనురాగ దేవత, చండశాసనుడు, బ్రహ్మంగారి చరిత్ర వంటి చిత్రాలతో పాటు సోదరుడు నందమూరి బాలకృష్ణ నటించిన పలు చిత్రాలకు అలాగే వెంకటేష్ నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా కూడా వ్యవహరించారు..


ఇవే కాకుండా తమిళ్లో శివాజీ గణేషన్ , ప్రభు నటించిన చరిత్ర నాయుగన్, బాలీవుడ్ లో ఫరూక్ షేక్ నటించిన గర్వాలి బాహర్వాలి చిత్రాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా కూడా పనిచేశారు.


ఇదీ చదవండి: రైల్వే ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌.. 3,445 పోస్టుల భర్తీ..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.