RRB NTPC Recruitment: రైల్వే ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌.. 3,445 పోస్టుల భర్తీ..

RRB NTPC Recruitment 2024: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌లో భాగంగా 3445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

 రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీ  అండర్‌ గ్రాడ్యుయేట్‌ కింద 3445 రైల్వే టికెట్‌ క్లర్క్‌ 2022 పోస్టులు, టైపిస్ట్‌ విభాగంలో 361 పోస్టులు, జూనియర్‌ టైపిస్ట్‌ 990, ట్రైన్‌ క్లర్క్‌ 72 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.   

2 /5

నేటి నుంచి ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా నోటిఫికేషన్‌ను కూడా క్షుణ్నంగా పరిశీలించాలి. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేవారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2024 సెప్టెంబర్‌ 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.  

3 /5

 అధికారిక వెబ్‌సైట్‌ rrbapply.gov.in ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ అక్టోబర్‌ 22. దరఖాస్తులో ఏవైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే అక్టోబర్‌ 23 నుంచి నవంబర్‌ 1 వరకు గడువు ఉంది.  

4 /5

అయితే, ఈ దరఖాస్తు చేసుకునేవారు రూ.500 చెల్లించాలి. ఆ తర్వాత రూ.400 తిరిగి చెల్లిస్తారు. మహిళ, ట్రాన్స్‌జెండర్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి చెందినవారు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.  

5 /5

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు అక్టోబర్‌ 20 చివరి తేదీ. ఈ భారీ నోటిఫికేషన్‌ ద్వారా  3445 నాన్‌ టెక్నికల్‌ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.