Nara Devansh: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నారా దేవాన్ష్.. ఆనందంలో నారా, నందమూరి ఫ్యాన్స్..
Nara Devansh world book of records: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కమ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మనవడు నారా దేవాన్ష్ ఖాతాలో అపుడే ఓ రికార్డు వచ్చి చేరింది. అవుతును ఆంధ్ర ప్రదేశ్ మంత్రి లోకేష్, బ్రాహ్మణిల కుమారుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు.
Nara Devansh world book of records: అవును 9 ఏళ్ల నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" సాధించి ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు. దీంతో నారా, నందమూరి కుటుంబం సంబరాలు చేసుకుంటున్నారు. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ "చెక్‌మేట్ మారథాన్" పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించడంతో ముందున్నాడు.
ఇదిలావుండగా ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమిషం 43సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మరి ఈ సర్టిఫికేట్ జారీ చేసారు. పట్టుదల, కృషి ఉంగటే తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు.
దేవాన్ష్ తాత చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండు పర్యాయాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాగే విభిజిత ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు సీఎంగా.. ఒకసారి ప్రతిపక్ష నేతగా రికార్డు నెలకొల్పారు. చంద్రబాబులా ప్రతిపక్ష నేతగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నేత తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాదు. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
దేవాన్ష్ మరో తాత నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. ఈయన కూడా తండ్రి ఎన్టీఆర్ అడుగు జాడల్లో సినీ రంగ ప్రవేశం చేసి ఒక నట వారసుడిగా 50 యేళ్లు అది కూడా ఇప్పటికీ హీరోగా కంటిన్యూ అవుతున్న నటుడు ఎవరు లేరు. ఒక రకంగా టాలీవుడ్ తో పాటు ప్రపంచ సినీ చరిత్రలో బాలయ్య రికార్డు ఎవరికీ లేదు. అలాంటి ఇద్దరు తాతల ముద్దుల మనవడు దేవాన్ష్ ఇపుడు తాతల రూట్లోనే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఆషామాషీ వ్యవహారం కాదనే చెబుతున్నారు రాజకీయ, సినీ విశ్లేషకులు.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.