ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై నారా లోకేష్ స్పందిస్తూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి ( జగన్ ) తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా..కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ని దెబ్బతీసారు అంటూ  కౌంటర్ ఇచ్చారు .దీనికి  తెలంగాణ ప్రభుత్వం డేటా దొంగిలించింది అని హాష్ టాప్ ఇచ్చారు


మరోక ట్వీట్ లో లోక్ ష్ స్పందిస్తూ హై కోర్ట్ సాక్షి గా దొర గారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాల పై విఆర్ఓ సంతకాల తో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీల పై దాడి చేసి ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారు అని తేలిపోయింది అని లోకేష్ వ్యాఖ్యానించారు.