Nara Lokesh-Ramoji Rao : రామోజీరావుతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే?
Nara Lokesh Met Ramoji Rao: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న క్రమంలో రామోజీరావును కలిసి ఆశీసులు తీసుకున్నారు. ఆ వివరాలు
Nara Lokesh Met Ramoji Rao: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమావేశం అవుతున్న నేపథ్యంలో నారా లోకేష్ మరికొద్ది రోజులలో పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. జనవరి 27వ తేదీన తన తండ్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారు.
అయితే నారా లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? ఇవ్వదా? యువత అనే విషయం మీద ఈరోజు క్లారిటీ వచ్చింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పాదయాత్ర నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పోలీసుల నుంచి పాదయాత్రకు అనుమతి లభించింది. దీంతో 27వ తేదీన నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించడం దాదాపు ఖాయమైనట్లే. అయితే ఈ నేపథ్యంలో నారా లోకేష్ తన పుట్టినరోజు సందర్భంగా తెలుగు మీడియా మొగల్ గా పేరు ఉన్న రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుతో భేటీ అయినట్లు తెలుస్తోంది.
తన పుట్టినరోజు సందర్భంగా రామోజీ దగ్గరికి వెళ్లిన నారా లోకేష్ ఆశీస్సులు తీసుకున్నారని చెబుతున్నారు. అదేవిధంగా తాను చేయబోతున్న పాదయాత్ర విశేషాలు కూడా రామోజీరావు దృష్టికి నారా లోకేష్ తీసుకువెళ్లారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల మీద కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఒకరకంగా అధికార వైసీపీ రామోజీరావు నడుపుతున్న మీడియా సంస్థల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ టార్గెట్ చేయడమే కాక ఎల్లో మీడియా అంటూ అభివర్ణిస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ మరోసారి రామోజీరావును కలవడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ అంశం మీద వైసీపీ నుంచి గట్టి కౌంటర్స్ పడే అవకాశం ఉంది.
Also Read: Honey Rose in NBK 108: బాలయ్య నెక్స్ట్ సినిమాలో హనీ రోజ్.. రికమెండ్ చేయడంతో?
Also Read: Bollywood Actors arrested: రష్మిక పేరుతో 20 లక్షల టోకరా..హైదరాబాద్లో బాలీవుడ్ నటీనటులు అరెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook