అమరావతి: ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యేలా చేస్తానని సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మద్యం పాలసీని ఎద్దేవా చేస్తూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్విటర్ ద్వారా సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో వైఎస్ జగన్ లిక్కర్ కంపెనీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించిన నారా లోకేష్.. పైగా ఇదంతా రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్ల కోసం చేస్తున్నామని చెప్పుకుంటున్నారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


దశల వారీగా మద్యపాన నిషేధం విధించిన తర్వాతే ఓట్ల కోసం మీ వద్దకు వస్తానని రాష్ట్ర ప్రజలకు గట్టి హామీ ఇచ్చి, ఆ దిశగా చర్యలు చేపట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.