Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ లో టీడీపీ తీసుకునే కీలక శాఖలు ఇవేనా?
Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే. ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో రాబోయే మోడీ క్యాబినేట్ లో తెలుగు దేశం పార్టీ కీలక శాఖలు కోరుకునే అవకాశాలున్నాయి.
Modi 3.O Cabinet: భారత దేశ ఎన్నికల్లో జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ కొత్త రికార్డు క్రియేట్ చేసారు. అప్పట్లో నెహ్రూ సెలెక్టెట్ ప్రధాన మంత్రిగా.. ఎలాంటి ప్రతిపక్షం లేకుండా వరుసగా మూడు సార్లు ప్రధాని అయ్యారు. కానీ నరేంద్ర మోదీ మాత్రం ప్రజల నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నుకోబడ్డ ప్రధాన మంత్రిగా భారత దేశంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. వాజ్ పేయ్ కూడా మూడు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. ఒకసారి 13 రోజుల.. రెండో సారి 13 నెలలు.. మూడోసారి 5 యేళ్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ నరేంద్ర మోదీ 2 టర్మ్ లు పూర్తి చేసుకొని మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ నెల 8న లేదా 9వ తేదిన ప్రధాన మంత్రిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. ఈ సారి మోదీ క్యాబినేట్ లో కింగ్ మేకర్స్ గా అవతరించి తెలుగు దేశం పార్టీకి కీలక శాఖలు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. కీలకమైన హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్ధిక, రైల్వే శాఖ తప్పించి మిగతా శాఖలను మిత్ర పక్షాలకు ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తెలుగు దేశం పార్టీ కీలకమైన పౌరవిమానయాన శాఖ, మరో కీలక శాఖతో పాటు లోక్ సభ స్పీకర్ పదవి కోరినట్టు తెలుస్తోంది. కానీ బీజేపీ అధిష్టానం డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా జేడీ (యూ)కు ఇచ్చేందకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అటు జనసేన పార్టీకి ఒక క్యాబినేట్ కాకుండా సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అటు షిండే శివసేనకు ఒక క్యాబినేట్, సహాయ మంత్రి పదవులు లభించే ఛాన్సెస్ ఉన్నాయి. అటు కేరళ నుంచి గెలిచిన సురేష్ గోపితో పాటు ఈ తమిళనాడులో పోటీ చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు అన్నామలైకు కూడా క్యాబినేట్ బెర్త్ దక్కే అవకాశాలున్నట్టు సమాచారం. కర్ణాటక నుంచి బీజేపీ నేతలతో పాటు కుమారస్వామి కూడా కేంద్ర క్యాబినేట్ లో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. ఈ సారి అమిత్ షా, జై శంకర్ శాఖలు తప్ప మిగిలిన సీనియర్ల శాఖలు పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్టు సమాచారం.
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు 240 సీట్లు కట్టబెట్టారు. తెలుగు దేశం పార్టీకి 16 సీట్లు.. జేడీయూ 12 సీట్లు.. లోక్ జనశక్తి రాంవిలాస్ పాశ్వాన్ పార్టీకి 5 సీట్లు..జనసేన, జేడీయూ పార్టీలకు చెరో రెండు సీట్లు వచ్చాయి. ఇప్పటికే నేడు జరిగే ఎన్టీయే ఎంపీల సమావేశం కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. నేడు జరిగే సమావేశంలో క్యాబినేట్ కూర్పుపై ఓ అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook