MP Raghu Rama Krishnam Raju RGV Vyuham Movie: అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు లేని ఆంక్షలు అమరావతి రైతులకు ఎందుకు..? అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి 29 వేల మంది కుటుంబాలు మోసపోయాయని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని న్యాయస్థానం చూస్తుంటే.. శాసన వ్యవస్థ అన్యాయం చేసేందుకు చూస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయాన్ని సాధించుకుందామని అమరావతి రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కాంట్రావర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ తీయనున్న వ్యూహం సినిమాపై కూడా ఎంపీ స్పందించారు. ఆయన వ్యూహం మూవీ తీస్తే.. మిగతవాళ్లు గండ్ర గడ్డలి, కోడి కత్తి సినిమాలు తీసే అవకాశం ఉందన్నారు. వ్యూహం మూవీ వచ్చే ఎన్నికలకు ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్‌ ఉందని చెప్పారు. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా..? గండ్ర గడ్డలి, కోడి కత్తి సినిమాలు హిట్ అవుతాయా..? లేదో చూడాలని అన్నారు. 


రాష్ట్రంలో మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాతున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. విశాఖను రాజధానిగా ఎవరు అడ్డుకోలేరంటూ వారు మాట్లాడిన మాటలు అర్థరహితమన్నారు. ఇక రాజధానిపై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న బెంచ్‌  నుంచి వేరే బెంచ్‌కు వెళితే.. విచారణకు వచ్చే అకాశం ఉందని చెప్పారు. 


ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాక్షసుల కంటే.. పోలీసులే ఎక్కువే హింసిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టినా మారలేదని.. ఇప్పుడు సీఐడీ పోలీసులకు సైతం కోర్టు మొట్టికాయలు వేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆరాచక పాలనలో గ్రామాలలోని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో తనలాంటి ఎంపీకే రక్షణ లేదని.. ఇక సామాన్యులను ఎక్కడ ఉంటుందన్నారు. కాపులను బీసీలలో చేర్చాలన్న డిమాండ్‌ను ఎంపీ రఘురామ సమర్థించారు. 


Also Read: Nagababu Birthday: మా చిన్నన్నయ్య ధృడంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు ప్రత్యేక స్థానం: పవన కళ్యాణ్‌  


Also Read: EPFO Pension Rules: మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా పెన్షన్‌కు అర్హులే.. ఈ రూల్స్‌ తెలుసుకోండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook