Tirumala Laddu Prasadam: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. లడ్డూలపై కొత్త రూల్స్ మీకు తెలుసా..!
TTD Laddu Prasadam Rules: తిరుమల లడ్డూలకు సంబంధించి ఇటీవల టీటీడీ కీలక మార్పులు చేసింది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకే లడ్డూలు అందనున్నాయి. దర్శనం టోకెన్ లేని భక్తులు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారికి రెండు లడ్డూలను అందజేయనున్నారు.
TTD Laddu Prasadam Rules: తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్య లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుని.. తమ కోరికలు నెరవేర్చాలని వేడుకుంటారు. అనంతరం స్వామి లడ్డూ ప్రసాదం తీసుకుని.. ఇంటికి వెళ్లిన తరువాత తమ బంధువులకు ఎంతో సంతోషంగా అందజేస్తారు. అయితే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూలపై ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. లడ్డూలకు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. దర్శనం చేసుకోకుండా కొందరు లడ్డూలను తీసుకుని.. బయట బ్లాక్‌లో అమ్ముకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు. సామాన్య భక్తులు నష్టపోతున్న నేపథ్యంలో మార్పులు చేసినట్లు చెబుతున్నారు. కొత్త రూల్స్ ప్రకారం.. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా.. 50 రూపాయలకు 4 నుంచి 6 లడ్డూలను అందజేస్తున్నారు.
Also Read: YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్
లడ్డూలను అక్రమంగా విక్రయించే వారికి అడ్డుకట్ట వేసేందుకు ఈ మార్పులను చేసినట్లు టీటీడీ అధికారులు అంటున్నారు. దర్శనం టికెట్ లేకుండా లడ్డూల కోసం వచ్చే వారికి రెండు లడ్డూలను ఇవ్వనున్నారు. అదీ కూడా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఆరు లడ్డూలు, దర్శనం టోకెన్ లేకుండా ఆధార్ చూపించి రెండు లడ్డూలు తీసుకోవచ్చు. భక్తుల ముసుగులో లడ్డూలను బ్లాక్‌లో అమ్మే వారికి చెక్ పెట్టినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా నాణ్యమైన లడ్డూలను అందించేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని చెబుతున్నారు. గతంలో ఉన్న నెయ్యి సరఫరాదారులను మార్చి.. కొత్త వారికి అప్పగించారు. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీని ఏర్పాటు చేయనుంది. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నందిని డెయిరీ నుంచి ఇక నుంచి నెయ్యిను కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భక్తుల కోరిక మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయించనున్నారు.
Also read: AP Rain Fall: ఏపీలో భారీ వర్షాలు విజయవాడలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.