YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్

Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 4, 2024, 06:58 PM IST
YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్

YS Jagan vs Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదలు రాజకీయ వివాదానికి దారి తీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర విమర్శలు ఆరోపణలు కొనసాగుతున్నాయి. మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలను నియంత్రించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Also Read: YS Sharmila: శెభాష్‌ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్‌ షర్మిల ప్రశంసలు

విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో బుధవారం మాజీ సీఎం జగన్‌ వరద బాధితులను పరామర్శించారు. బాధితుల వద్దకు నేరుగా వెళ్లి వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఏం చేయడం లేదని విమర్శించారు. ప్రణాళికబద్దంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. 'వర్షాలు, వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు ఆయనకు కనికరం లేదు. విజయవాడలో ఏ కాలనీకి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది' అని తెలిపారు.

Also Read: Chandrababu 4th Day: నా ప్రజల కష్టాలు తీరేదాకా నా ఇల్లు కలెక్టర్ కార్యాలయమే! సీఎం చంద్రబాబు

'వరదతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది. తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టర్‌ కార్యాలయంలో ఉండి బిల్డప్‌ ఇస్తున్నారు' అని మాజీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చిన సమయంలో స్పందించిన తీరును జగన్‌ వివరించారు. 'మా హయాంలో గోదావరికి వరదలు వస్తే వేల మందిని సహాయ కేంద్రాలకు తరలించాం. వలంటీర్లు ముందుగానే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. వరద ప్రభావం తగ్గాక ఖాళీ చేతులతో వెళ్లకుండా తక్షణ పరిహార సొమ్మును అందించి పంపించాం' అని తెలిపారు.

'వరద నివారణలో సీఎం చంద్రబాబు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉండి చేయాల్సిన పనులు చేయలేదు. వర్షాలు, వరదలతో 32 మంది మరణానికి చంద్రబాబే బాధత్య. ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అర్హుడేనా? తప్పు చంద్రబాబు చేశాడు కాబట్టి ప్రతి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ప్రతి ఇంటికి రూ.50 వేలు అందించాలి' అని మాజీ సీఎం జగన్‌ డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News