YCP PARTY: నెల్లూరు లీడర్లకు మోడీ భయం.. మేకపాటి ఫ్యామిలీ దారెటు!
YCP PARTY: నెల్లూరు జిల్లాలో ఆ కుటుంబానిదే ఆధిపత్యం.. సింహాగిరి రాజకీయాలన్నీ ఆ కుటుంబం చుట్టూ తిరుగుతాయి. కానీ.. ఇటీవల ఆ కుటుంబం రూట్ మారుస్తోందా..! వచ్చే ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోందా..! ఇంతకీ నెల్లూరులో ఆ ఫ్యామిలీ చేయాలనుకుంటున్న రాజకీయం ఏంటి..!
YCP PARTY: నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకోమలుపు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లు చేసిన రాజకీయం ఒకెత్తు.. ఇకమీదట జరిగే రాజకీయం మరోలా ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చాలా ఏళ్లుగా చక్రం తిప్పుతున్న మేకపాటి రాజ్ మోషన్ రెడ్డి కుటుంబాన్ని డి లిమిటేషన్ భయం వెంటాడుతుందట. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే ఎక్కడి నుంచి పోటీ చేయాలా అని మేకపాటి కుటుంబం ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మేకపాటి కుటుంబం రెండు గ్రూపులుగా విడిపోయినట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రొత్సాహంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన మేకపాటి రాజ్‌మోషన్ రెడ్డి కుటుంబం.. వైఎస్ హయాంలో నెల్లూరులో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఓ వైపు నెల్లూరు ఎంపీగా రాజ్‌మోహన్ రెడ్డి కొనసాగితే. ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ వైఎస్ మరణం తర్వాత ఈ కుటుంబం ఒక్కసారిగా డీలా పడింది. ఆ తర్వాత మేకపాటి ఫ్యామిలీ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి వైఎస్ జగన్ వెంట నడిచింది. అయితే 2019 ఎన్నికల్లో మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. దాంతో తన వారసుడు గౌతమ్ రెడ్డిని బరిలో దింపారు. అయితే ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి భారీ విజయం సాధించడంతో.. జగన్ గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి సైతం ఇచ్చారు. ఇక్కడే అన్న తమ్ముడి మధ్య తేడా కొట్టింది. గౌతమ్ రెడ్డికి మినిస్ట్రీ రావడంతో చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే అప్పటికే మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకూరులో రెబల్‌గా మారిపోయారు. అయితే అక్కడ మేకపాటి మరొ కుమారుడు విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. దాంతో పచ్చటి కుటుంబంలో రాజకీయం ఒక్కసారిగా చిచ్చురేపినట్టయింది.
మరోవైపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేయగా.. విక్రమ్ రెడ్డి మరోసారి ఆత్మకూరు నుంచి పోటీచేశారు. అయితే ఇద్దరూ కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఈ కుటుంబం లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు డి లిమిటేషన్ జరిగితే ఉదయగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఇతర నియోజకవర్గాల్లో కలిసే చాన్స్ ఉందట. గతంలో మేకపాటి సొంత మండలం మర్రిపాడు.. ఉదయగిరిలో కలిస్తే.. ఇప్పుడు ఆత్మకూరులో కలిసే అవకాశం ఉందట. కాబట్టి ఈసారి రెండు నియోజకవర్గాల్లో కాకుండా ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం దొరికితే మేకపాటి కుటుంబం ఉదయగిరి ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొకరు నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
గతంలో మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి ఒకరు ఎంపీ గా పోటీచేస్తే.. మరొకరు ఉదయగిరి ఎంపీగా బరిలో నిలిచేవారు. ఇప్పుడు కూడా ఆదే స్ట్రాటజీని ఫాలో అవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే ఫార్ములాను కంటిన్యూ చేసిన మేకపాటి ఫ్యామిలీ.. ఇకమీదట కూడా దీన్నే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నెల్లూరులో మేకపాటి ఎంపీగా పోటీ చేయడం ద్వారా ఉదయగిరిలో కూడా చక్రం తిప్పొచ్చని భావిస్తున్నారట. ఎందుకంటే నెల్లూరు పార్లమెంటు పరిధిలోకే ఉదయగిరి నియోజకవర్గం వస్తుందని కాబట్టి.. మొత్తంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లోనూ చక్రం తిప్పాలని మేకపాటి ఫ్యామిలీ అనుకుంటోందట. అందుకే మూడు నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ అవకాశం దొరికితే మూడుచోట్ల పోటీ చేసి తమ ఆధిపత్యాన్ని చూడాలని అనుకుంటోందట. లేని పక్షంలో ఉదయగిరి అసెంబ్లీ సీటు.. నెల్లూరు ఎంపీగా బరిలో ఉండాలని లెక్కలు వేసుకుంటోందట. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో మేకపాటి ఫ్యామిలీ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందో..!
Also Read: AP POLITICS: కూటమి సర్కార్‌లో ఆ నేతకు ఘోర అవమానం!
Also Read: Vizag: 'వచ్చి కోరిక తీరుస్తావా.. వీడియోలు బయటపెట్టాలా?'.. లా విద్యార్థిపై నలుగురు గ్యాంగ్ రేప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter