మోడీ సర్కార్కు న్యూ ఇయర్ గిఫ్ట్; దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమౌతున్న కార్మికులు !
తమ డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించాయి
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సీర్కార్కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు కార్మిక సంఘాలు సిద్ధమౌతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం తమ డిమాండ్ల సాధన కోసమే సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగాలని వామపక్షాల అనుబంధ కార్మికు సంఘం ఐఎఫ్టీయూ ప్రకటించింది. వీటికి మరికొన్ని కార్మిక సంఘాల మద్దతు తెలిపాయి.
సమ్మెకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నేత ఏ నరేందర్ సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 12 డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెను చేపట్టాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు సమ్మెకు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. కార్మికుల కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని.. అలాగే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈ సందర్భగా డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ రంగ రక్షణ, రైల్వే, బ్యాంకు, రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించరాదని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.