Rajya Sabha members takes oath: ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ( Rajya Sabha ) కు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ( YSR Congress Party ) కి చెందిన సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాజ్యసభ చైర్మన్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభలో ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (Alla Ayodhya Rami Reddy) హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెలుగులో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ( Pilli Subhash Chandra Bose ) , మోపిదేవి వెంకట రమణారావు (Mopidevi Venkataramana) రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. Also read: Political Science: వేర్పాటువాదం చాప్టర్‌‌ను తొలగించిన NCERT


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఏపీకి చెందిన మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేదు. నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని, మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రమాణ స్వీకారం చేసిన నూతన రాజ్యసభ సభ్యులను పలువురు అభినందించారు. Also read: Andhra Pradesh: సెప్టెంబరు 5 నుంచి పాఠశాలల ప్రారంభం


అయితే 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన విషయం అందరికీ తెలిసింది. అయితే వారినందరినీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది ఈ రోజు హాజరుకాలేదు. Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే