Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే

కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారతదేశానికి ఇది కచ్చితంగా శుభవార్తే. ప్రపంచం ఎదురుచూస్తున్న ఆక్స ఫర్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయబోతున్న ఇండియన్ కంపెనీ ఆ కీలక విషయాన్ని వెల్లడించింది. వ్యాక్సిన్ ఉత్పత్రిలో 50 శాతం భారత్ కే కేటాయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Last Updated : Jul 22, 2020, 11:18 AM IST
Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే

కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారతదేశానికి ఇది కచ్చితంగా శుభవార్తే. ప్రపంచం ఎదురుచూస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయబోతున్న ఇండియన్ కంపెనీ ఆ కీలక విషయాన్ని వెల్లడించింది. వ్యాక్సిన్ ఉత్పత్రిలో 50 శాతం భారత్‌కే కేటాయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమని అందరికీ తెలుసు. అందుకే ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. వ్యాక్సిన్ రేసులో అన్నింటికంటే ముందున్నది ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ. ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ ను ఉత్పత్తి, సరఫరా బాధ్యత ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దక్కించుకున్న విషయం తెలిసిందే. తొలిదశ ప్రయోగాల ఫలితాలు విజయవంతమయ్యాయని..వైరస్ ను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని తమ వ్యాక్సిన్ కలిగి ఉందని ఆక్స్ ఫర్డ్ తాజాగా ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో మూడో దశ ప్రయోగాలు కూడా ప్రారంభం కానున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఆక్స్ ఫర్డ్ ఒప్పందం కుదుర్చుకుంది.  ప్రపంచానికి ఉత్పత్తి, సరఫరా చేసే బాధ్యత ఇండియన్ కంపెనీదే. Also read: Vaccine: దేశీయ వ్యాక్సిన్ ట్రయల్స్ కు 1125 శాంపిల్స్ సిద్ధం

సగం వ్యాక్సిన్ ఇండియాకే:

ఇప్పుడీ కంపెనీ సీఈఓ అదార్ పూణావాలా కీలకమైన ఓ శుభవార్తను ప్రకటించారు. తాము ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియాకే కేటాయిస్తామని..మిగిలింది ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చాక  అందరికీ అందుతుందా లేదా అనే సందేహం నెలకొన్న నేపధ్యంలో అదార్ పూణావాలా  చేసిన ప్రకటన ఆనందం కల్గిస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్ కు వ్యాక్సిన్  ముందుగా అందుబాటులో తీసుకురావడానికి ఆక్స్ ఫర్డ్ కు మాత్రమే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇది ఇండియాకు కచ్చితంగా ఓ శుభవార్త. Also read: Covid19: దేశంలో అత్యంత ప్రమాదకర జిల్లాలివే

Trending News