ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జరిగిన హత్యాయత్నం కేసు విచారణలో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో కీలక పరిణామం జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ ఆంజనేయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018 అక్టోబర్ 25వ తేదీన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ఈ కేసును విచారణకు చేపట్టిన ఎన్ఐఏ 2019 ఆగస్టు 13న ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో విచారణ ప్రారంభించేందుకు ఎన్ఐఏ నిన్న మెమో దాఖలు చేసింది. ఛార్జిషీటులో 56 మంది సాక్షులుగా ఉండగా..విచారణకై 10మందితో జాబితా పొందుపర్చి..విచారణ షెడ్యూల్ ఇవ్వాలని ఎన్ఐఏ కోరింది. అయితే ఈ కేసులో నిందితుడి న్యాయవాది సలీం అభ్యంతరం తెలిపాడు.


ఎన్ఐఏ రూపొందించిన విచారించాల్సిన వారి జాబితాలో బాధితుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఎన్ఐఏ తరపు న్యాయవాది మాత్రం ముందు పదిమంది సాక్ష్యుల్ని విచారించాలని పేర్కొంది. దాంతో జస్టిస్ ఆంజనేయమూర్తి ఎన్ఐఏ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో బాధితుడి సాక్ష్యం విలువైందని..అది లేకుండా మిగిలినవారిని విచారించలేమన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన సీఐఎస్ఎఫ్ అధికారి దినేష్ కుమార్‌ను విచారిస్తామని..జనవరి 31 నుంచి విచారణ మొదలౌతుందని కోర్టు తెలిపింది. 


ఈ కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తీసుకువస్తామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సీఐఎస్ఎఫ్ అధికారి దినేష్ కుమార్, బాధితుడు జగన్ వాంగ్మూలం తమకు ఇవ్వలేదనేది నిందితుడి తరపు న్యాయవాది వాదనగా ఉంది. అదే సమయంలో ఎన్ఐఏ ఇచ్చిన మొదటి 12 మంది వాంగ్మూలాల్లో ఈ ఇద్దరి పేర్లు లేవు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు వరుసగా ఏడవసారి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. 


Also read: Severe Snow fall: భద్రినాథ్, మాతో వైష్ణోదేవి ఆలయ ప్రాంతాల్ని ముంచేసిన మంచు, 18 వరకూ మరింత జటిలం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook