Nimmagadda Ramesh Kumar: బీజేపీ నేతలతో నిమ్మగడ్డ భేటీ వీడియో వైరల్.. రంగంలోకి దిగిన బీజేపి
Nimmagadda meeting with BJP leaders: అమరావతి: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar ) మరోసారి వివాదాస్పదమయ్యారు. బీజేపీ నేతలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ అయిన వీడియో వెలుగులోకి రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది... అసలేం జరిగింది.
Nimmagadda meeting with BJP leaders: అమరావతి: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar ) మరోసారి వివాదాస్పదమయ్యారు. బీజేపీ నేతలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ అయిన వీడియో వెలుగులోకి రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది... అసలేం జరిగింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ( Nimmagadda Ramesh Kumar ) తీవ్ర ఆరోపణలు సంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఆయుధం లభించింది. ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలకు సంబంధించిన వీడియో వెలుగు చూడటంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాము చెప్పిందే నిజమైందని అధికార వైసీపీ వాదిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి, ( Sujana Chowdary ) మరో బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ( Kamineni Srinivas ), ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లు ఈనెల 13 వ తేదీ ఉదయం 10 గంటల 40 నిమిషాలకు భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు వీరి సమావేశం కొనసాగింది. హోటల్‌లో ఈ ముగ్గురి బేటీకి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడంతా చర్చనీయాంశమవుతోంది. ( Also read : YSRCP ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. వారిలో తొలి కేసు )
అనుమానాలకు తావిచ్చిన భేటీ:
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న నేపధ్యంలో ఈ ముగ్గురి భేటీ అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ ముగ్గురూ విడివిడిగా హోటల్‌కు రావడం, ఒకే వ్యక్తి ముగ్గుర్ని హోటల్‌లో రిసీవ్ చేసుకోవడం, ఒకే గదిలో సమావేశం కావడం కచ్చితంగా అనుమానాస్పదంగానే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఓ గౌరవప్రదమైన ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి... ప్రోటోకాల్‌ను కాదని రాజకీయ నేతలతో హోటల్‌లో కలవడం వెనుక ఆంతర్యమేంటనేదే ఇప్పుుడు ప్రధానంగా విన్పిస్తున్న ప్రశ్న.
ఏపీ సర్కార్‌కి, నిమ్మగడ్డకు మధ్య ఏం జరిగింది ?
స్థానిక సంస్థల ఎన్నికల్ని కరోనావైరస్ కారణంగా చూపిస్తూ... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ మాత్రం సంప్రదించకుండా ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రద్దు చేయడంతో అధికార వైసీపీ ప్రభుత్వం ( YCP govt ) ఆగ్రహం చెందింది. ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను తొలగించి మరో వ్యక్తిని ఆ పదవిలో ఏపీ ప్రభుత్వం నియమించింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు ( AP high court ) వెళ్లిన నిమ్మగడ్డకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడింది. అయితే ఏపీ ప్రభుత్వం సుప్రీంలో తన పిటీషన్ వేయడంతో ఇప్పుడీ అంశంపై విచారణ జరుగుతోంది. ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ మనిషి అని... ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిచడమే కాకుండా కమ్మ సామాజికవర్గ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS JAGAN ) తో సహా వైసీపీ వర్గాలంతా ప్రధానంగా ఆరోపణలు చేశాయి. ( Also read : సీఎం వైఎస్ జగన్ మరో కొత్త పథకం )
వైసిపి నేతల వాదనలకు బలం
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో కూడా తాము చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తోందంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే నిమ్మగడ్డతో భేటీ అయిన మరో ఇద్దరు అదే సామాజికవర్గానికి చెందినవారు. మొన్నటివరకూ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఇప్పుడు బీజేపీ పార్టీ ( BJP ) తీర్ధం పుచ్చుకున్నవారు కావడమే దీనికి కారణం. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 11 వ తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో పిటీషన దాఖలు చేసిన మరుసటి రోజున అంటే ఏప్రిల్ 12వ తేదీన … బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ ఇదే అంశంపై మరో పిటీషన్ వేశారు. ఈ రెండు పిటీషన్లలోనూ ఒకే రకమైన స్క్రిప్ట్ ఉందని... అందుకు తగినట్టుగానే ఇప్పుడీ వీడియో కూడా బయటికొచ్చిందని వైసిపి చెబుతోంది.
రంగంలోకి దిగిన బీజేపి..
బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య సమావేశం వివాదాస్పదంగా మారడంతో బీజేపీ అధిష్టానం రంగంలో దిగింది. హోటల్ రూమ్‌లో అంత రహస్యంగా సమావేశమవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపి అధిష్టానం ఇరువురు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. నిమ్మగడ్డ వ్యవహారంపై బహిరంగపోరాటం చేయమని తమ పార్టీ చెప్పిందని కానీ..... కుట్రలు చేయమని కాదని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం సరికాదని బీజేపీ అధిష్టానం హెచ్చరించినట్టు సమాచారం అందుతోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..