ఏపీకి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కేటాయింపు
నీతి ఆయోగ్ ఏపీ రాష్ట్రానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ఏటీఎల్) కేటాయించింది.
నీతి ఆయోగ్ ఏపీ రాష్ట్రానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ఏటీఎల్) కేటాయించింది. రాష్ట్రానికి 131 ఏటీఎల్ కేటాయించినందుకు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ నీతి ఆయోగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా అటల్ ఉపయోగపడుతుందన్నారు.
కాగా.. నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం) కింద దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతలను ప్రోత్సహించేందుకు రెండోదశలో అదనంగా 1500 స్కూల్స్ ను ఎంపిక చేసి 'అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ఏటీఎల్) ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో, ఏఐఎం ఒక సంవత్సరం క్రితం దాని కార్యకలాపాలను ప్రారంభించిన నాటినుండి, 'ఏటీఎల్' లను స్థాపించడానికి భారతదేశం అంతటా 2441 పాఠశాలలను ఎంచుకుంది.
ముఖ్యంగా 12-18 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణలకు ఉపయోగపడే నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఏటీఎల్ ముఖ్య లక్ష్యం. ప్రభుత్వం దీనికోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. నూతన ఆవిష్కరణలకు కావలసిన పరికరాలు, వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.