ప్రాణ త్యాగాలు అక్కర్లేదు-ప్లకార్డులు పట్టుకోండి చాలు-వైసీపీ ఎంపీలకు పవన్ చురకలు
Pawan Kalyan demands YSRCP MP`s to hold placards: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేశారు. ప్రాణ త్యాగాలు కాదు.. కనీసం పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని నిరసన గళం వినిపించాలని చురకలంటించారు.
Pawan Kalyan demands YSRCP MP's to hold placards: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేశారు. ప్రాణ త్యాగాలు కాదు.. కనీసం పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని నిరసన గళం వినిపించాలని చురకలంటించారు. 'విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటామని చెప్పారు. అంత త్యాగాలు అక్కర్లేదు... కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు...' అని వైసీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని పార్లమెంటులో వైసీపీ ఎంపీలు వినిపించాలని డిమాండ్ చేస్తూ జనసేన (Janasena) డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు ప్లకార్డులతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిరసన తెలుపుతున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు (Vizag steel plant privatisation) వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు మద్దతుగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గతవారం సంఘీభావ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండుతో ఏపీ ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ఆ సందర్భంగా పవన్ డిమాండ్ చేశారు. తాము ప్రజాక్షేమం కోరుకునేవాళ్లమని.. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడుతామని అన్నారు. పదవులు ఆశించకుండా సేవ చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని... ప్రజాక్షేమం కోరేవారికే వారి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: Omicron symptoms: ముక్కు కారడం, గొంతులో మంటగా ఉందా? అది ఒమిక్రాన్ కావచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి