Omicron symptoms: ముక్కు కారడం, గొంతులో మంటగా ఉందా? అది ఒమిక్రాన్ కావచ్చు!

Omicron symptoms: ఒమిక్రాన్ వేరియంట్​పై యూకేకు చెందిన ఓ అధ్యాయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. జబులు, తలనొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలు ఒమిక్రాన్ లక్షణాలు కావచ్చని అధ్యాయనం తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 02:02 PM IST
  • ఒమిక్రాన్ లక్షణాలపై యూకే అధ్యాయనంలో కీలక
  • జలుబు సంబంధింత లక్షణాలే అధికం
  • క్రిస్మస్ వేడుకల్లో జాగ్రత్త అవసరమన్న నిపుణులు
Omicron symptoms: ముక్కు కారడం, గొంతులో మంటగా ఉందా? అది ఒమిక్రాన్ కావచ్చు!

Omicron symptoms: మీకు ముక్కు కారడం (Runny nose), గొంతులో మంట, తలనొప్పి, అలసటగా అనిపిస్తుందా? అయితే జాగ్రత్త అవి ఒమిక్రాన్​ లక్షణాలు (Omicron early symptoms) కావచ్చు. యూకేకు చెందిన ఓ స్టడీలో ఒమిక్రాన్​ వేరియంట్​ను ముందే గుర్తించే (అంచనా) విధంగా కీలక విషయాలను వెల్లడించింది.

'జోయ్​ కొవిడ్ స్టడీ యాప్' (Zoe Covid Study)​.. వందలాది మందిపై చేసిన పరిశోధన ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. పరిశోధనలో భాగంగా కొవిడ్ సోకిన వారిని ఈ యాప్​.. ఎలాంటి లక్షణాలు ఉన్నాయని అడగ్గా.. చాలా మంది దాదాపు ఒకే విధమైన సామాధానం చెప్పారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న వందలాది డిసెంబర్ 3 నుంచి 10 తేదీల మధ్య.. జలుబు (Cold), ముక్కు కారడం, తలనొప్పు, గొంతు మంట (Sore throat), అలసట వంటి లక్షణాలు ఉన్నట్లు తెలితపారు.

జలుబు లక్షణాలే ఎక్కువ..

పరిశోధన నివేదిక ప్రకారం.. సాధారణ కరోనా వైరస్​తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్​ లక్షణాలు ఎక్కువగా జలుబుకు సంబంధించినవే ఉన్నాయి. సాధారణ కొవిడ్​కాన్నా ఇవి కాస్త భిన్నంగా ఉన్నట్లు పరిశోధన వెల్లడించింది. సాధారణ కొవిడ్​ అయితే జలుబు, దగ్గు మాత్రమే కాకుండా.. జ్వరం, వాసన, రుచి కోల్పోవడం (Corona symptoms) వంటివి ఎక్కవ మందికి వచ్చిన లక్షణాలు.

జోయ్​ సింప్టమ్స్ ట్రాకింగ్ స్టడీ ప్రధాన శాస్త్రవేత్త, అంటువ్యాధుల నిపుణులు ప్రొఫెసర్ టిమ్​ స్పెక్టర్.. ఈ ఫలితాల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వానికి ఓ కీలక సూచన చేశారు. క్రిస్మస్​ సందర్భంగా ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశమున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

పండులో తగిన జాగ్రత్తలు పాటించాలన ప్రజలను హెచ్చరించాలని సూచించారు. భౌతిక దూరం పాటించడం, వేడుకల్లో పాల్గొనే వ్యక్తులకు స్క్రీనింగ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

యూకేలో ప్రమాదకర స్థాయికి ఒమిక్రాన్​..

యూకేలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు ప్రమాదక స్థాయికి పెరిగాయి. ఒక్క రోజులో (ఆదివారం) 12 వేలకుపైగా కేసులు (Omicron cases in UK) నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 37,101 కేసులు బయటపడ్డాయి.

Also read: Rare Pregnancy Case: అత్యంత అరుదైన ప్రెగ్నెన్సీ కేసు... ఆ మహిళ కాలేయంలో పిండం...

Also read: UberEats: స్పేస్​లోకి పుడ్ డెలివరీ చేసిన తొలి సంస్థగా 'ఉబర్ ఈట్స్'..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x