NTRs Daughter Uma Maheswari Passes Away: ఎన్టీయార్‌ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, నందమూరి వంశంలో విషాదం అలుముకుంది. అయితే, ఎన్టీయార్‌ సంతానంలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు ప్రజల అన్నగా వెలుగొందిన ఎన్టీయార్‌ ఫ్యామిలీలో మరో విషాదం కలకలం రేపింది. ఎన్టీయార్‌ చిన్న కూతురు ఉమామహేశ్వరి మరణించారు. అయితే, ఆమె ఆత్మహత్య చేసుకోవడం మరింత విషాదాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుర్ఘటనతో నందమూరి కుటుంబంలో విషాదం అలుముకుంది.



నందమూరి తారకరామారావుకు మొత్తం 12 మంది సంతానం. వారిలో ఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కూతుళ్లు. వీళ్లలో ముగ్గురు కుమారులు చనిపోయారు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఎన్టీయార్‌ బతికి ఉండగానే చనిపోగా.. మిగతా ఇద్దరు కుమారులు ఎన్టీయార్‌ స్వర్గస్థులైన తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఆయన చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు దీంతో, ఎన్టీయార్‌ సంతానంలో ముగ్గురు కుమారులు, ఓ కూతురు మరణించారు. ఆయన 12 మంది సంతానంలో మొత్తం నలుగురు చనిపోయారు. దీంతో, ఇప్పుడు ఐదుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.


ఎన్టీ రామారావు పెద్ద కుమారుడు రామకృష్ణ చిన్నతనంలోనే అరుదైన వ్యాధితో చనిపోయాడు. రామకృష్ణ మరణించిన సమయంలో ఎన్టీయార్‌ ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఇరుగు పొరుగు సినిమా షూటింగ్‌ అప్పుడు నడుస్తోంది. అయితే, విషయం తెలిసినప్పటికీ షూటింగ్ పూర్తయిన తర్వాతే  ఎన్టీయార్‌ ఇంటికి తిరిగి వచ్చారట. రామకృష్ణ చనిపోవడంతో ఆ విషాదం నుంచి కోలుకోవడానికి ఎన్టీయార్‌కు చాలా రోజులు పట్టిందని చెబుతారు.


కొన్నేళ్ల క్రితం ఎన్టీ రామారావు ఐదవ కుమారుడు సాయికృష్ణ కన్నుమూశారు. అనారోగ్యంతో సాయికృష్ణ మరణించారు. ఎన్టీరామారావు వ్యక్తిగత విషయాలన్నీ సాయికృష్ణే చూసుకునేవారని కుటుంబసభ్యులు చెబుతారు.


ఇక, నందమూరి హరికృష్ణ.. ఎన్టీయార్‌ కుమారుడిగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. అలాగే సినీరంగంలోనూ తన ఉనికి చాటుకున్నారు. నాలుగేళ్లక్రితం.. 2018 ఆగస్టు 29వ తేదీన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.


నందమూరి తారక రామారావుకు మొత్తం నలుగురు కూతుళ్లు వారిలో పెద్ద కూతురు లోకేశ్వరి కాగా రెండో కూతురు పురంధేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు భార్య. మూడో కూతురు నారా భువనేశ్వరి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు భార్య. ఇక, ఎన్టీయార్‌ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి. ఆమె.. ఉరేసుకొని  చనిపోవడం నందమూరి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా పరిశ్రమలోనూ ఈ పరిణామం చర్చనీయాంశమయ్యింది.


Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా.


Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook