పూజ గదిలో పడుకోబెట్టి.. చిన్నారి నోట్లో కుంకుమ కుక్కి.. తాంత్రిక పూజల పేరుతో బిడ్డను బలితీసుకున్న తండ్రి..
Father Stuffed Kumkum in 3 years Old Daughters Mouth: తాంత్రిక పూజలు చేస్తే వ్యాపారంలో నష్టాలు తొలగిపోతాయని భావించిన ఓ తండ్రి.. తన మూడేళ్ల చిన్నారి నోట్లో కుంకుమ కుక్కి ఊపిరాడకుండా చేశాడు. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Father Stuffed Kumkum in 3 years Old Daughters Mouth: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తాంత్రిక పూజలకు బిడ్డ బలైంది. మూడేళ్ల చిన్నారి నోటి నిండా కుంకుమ కుక్కి పూజలు చేశాడు ఆ తండ్రి. ఊపిరాడక ఆ చిన్నారి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చారు. బాలికను ఆ స్థితిలో చూసి షాక్ తిన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా పేరారెడ్డిపల్లికి చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. తాంత్రిక పూజలు చేస్తే ఆ నష్టాల నుంచి బయటపడుతానని భావించి బుధవారం (జూన్ 16) ఇంట్లోనే పూజలు నిర్వహించాడు. పూజ సందర్భంగా తన ఇద్దరు కవల పిల్లల్లో ఒకరైన చిన్నారిని (3) పూజ గదిలో పడుకోబెట్టాడు. ఆమె ఒంటిపై పసుపు నీళ్లు పోశాడు.
అనంతరం ఆమె నోటి నిండా కుంకమ కుక్కాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక ఇబ్బంది పడింది. ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టింది. దీంతో చుట్టుపక్కలవారు పరిగెత్తుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను మొదట ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన గురించి తెలిసి పోలీసులు ఆ చిన్నారి తండ్రి వేణు గోపాల్‌ను అరెస్ట్ చేశారు.
గతేడాది మదనపల్లెలో ఇలాగే తాంత్రిక పూజలు చేసిన ఓ తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలనే బలితీసుకున్న సంగతి తెలిసిందే. విద్యావంతులైన ఆ కుటుంబం మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకుని తాంత్రిక పూజలతో పునర్జన్మ లభిస్తుందని నమ్మారు. చివరకు అత్యంత కిరాతకంగా కన్నబిడ్డలనే డంబెల్‌తో కొట్టి హత్య చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే నెల్లూరులో చోటు చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read: Agnipath Scheme: 'అగ్నిపథ్' స్కీమ్‌పై తీవ్ర నిరసనలు.. బీహార్‌లో హింసాత్మక సంఘటనలు.. రైలుకు నిప్పు..
Also Read: Agnipath Scheme: 'అగ్నిపథ్' స్కీమ్‌పై తీవ్ర నిరసనలు.. బీహార్‌లో హింసాత్మక సంఘటనలు.. రైలుకు నిప్పు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook