Naravaripalli: తీవ్ర విషాదంతో స్వగ్రామం చేరిన సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?
Chandrababu Emotional After Reached Naravaripalli For His Brother: స్వగ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు విషాద వదనంతో వెళ్లారు. తన సోదరుడి పెద్ద కర్మ సందర్భంగా కుటుంబంతో సహా ఇంటికి చేరుకున్నారు. రేపు కుటుంబంతో గడపనున్నారు.
Nara Ramamurthy Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లికి చేరుకున్నారు. సోదరుడి కర్మ క్రియల్లో పాల్గొనేందుకు కుటుంబంతో సహా ఆయన చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం వెళ్లారు. ఇటీవల కన్నుమూసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడి కర్మక్రియలు గురువారం జరగనున్నాయి. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి బుధవారం రాత్రి 7:30 గంటలకు చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామానికి చేరుకోగా కుటుంబసభ్యులు.. టీడీపీ నాయకులు స్వాగతం పలికారు.
ఇది చదవండి: Sarada Peetham: సీఎం చంద్రబాబు దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌ను వీడిన స్వామిజీ? ఎవరో తెలుసా?
హైదరాబాద్‌లో నివసించే చంద్రబాబు సోదరుడు నారా రామమూర్తి నాయుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మృతితో చంద్రబాబు కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వగ్రామం నారావారిపల్లికి తరలించి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. తీవ్ర శోకంలో మునిగిన ఆ కుటుంబాన్ని అండగా నిలిచారు. సోదరుడి కుమారుడు నారా రోహిత్, అతడి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
ఇది చదవండి: YS Sharmila: అదానీ ఒప్పందంపై జగన్ తన బిడ్డలపై ప్రమాణం చేయాలి.. వైఎస్ జగన్‌కు షర్మిల ఛాలెంజ్!
ఈ క్రమంలోనే సోదరుడు రామమూర్తి నాయుడు కర్మ క్రియ గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే నారావారిపల్లిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితోపాటు నారా కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. కర్మక్రియ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరితోపాటు కూటమి నాయకులు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. నారావారిపల్లిని తమ నియంత్రణలోకి పోలీస్ శాఖ తీసుకుంది. సీఎం పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ముందస్తు భద్రత ఏర్పాట్లను చిత్తూరు కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షించారు. ఎలాంటి భద్రతా వైఫల్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.