Ongole police reached near ram gopal varma house: కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన ఆర్జీవీకి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో.. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టిన ఘటనపై ఒంగోలులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలు నుంచి పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలోనే తమ ముందు హజరు కావాలని ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు జారీ చేశారు. కానీ ఆర్జీవీ మాత్రం.. తాను సినిమాల వల్ల బిజీగా ఉన్నానని, విచారణకు మరింత సమయం కావాలని తన లాయర్ తో పోలీసులకు రిక్వెస్ట్ లెటర్ ను పంపించారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ.. ఈ కేసులో అరెస్టు నుంచి తనకు స్టే ఇవ్వాలని కూడా ఏపీ హైకొర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది.


ఈ క్రమంలో నాలుగు రోజు కావడంతో మళ్లీ...తాజాగా.. ఒంగోలు పోలీసులు మళ్లీ హైదరాబాద్ కు రావడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇంకా సమయం కావాలని మరోసారి లాయర్ పోలీసులు రిక్వెస్ట్ లెటర్ అందించారంట. అయిన కూడా పోలీసులు రావడం మాత్రం వార్తలలో నిలిచింది. అయితే.. ఆర్జీవీ ఇంట్లో లేడని అక్కడి వాళ్లు చెప్పినట్లు సమాచారం. కానీ పోలీసులు మాత్రం పలు కొన్ని బృందాలుగా విడిపోయి.. కొంత మంది ఆర్జీవి ఇంటి దగ్గర, మరికొందరు అసలు ఆర్జీవీ ఎక్కడున్నారని కూడా విచారణ చేస్తున్నారంట.  


Read more: Lady Aghori: ట్రెండ్ మార్చిన అఘోరీ..?.. సడెన్‌గా గడ్డం, మీసాలతో హల్ చల్.. ఎక్కడంటే..?


కొంత మంది మాత్రం ఆర్జీవి ఇంట్లోనే ఉన్నారని కూడా అంటున్నారు. దీంతో పోలీసులు ఆర్జీవిని అరెస్ట్ చేస్తారని వాదనలు గట్టిగా విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ తరపు లాయర్ మాత్రం.. తాము ఆన్ లైన్ లో.. వీడియో మాధ్యమంలో విచారణకు హజరు అయ్యేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పినట్లు తెలుస్తొంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆర్జీవీ అరెస్ట్ కు పోలీసులు అన్ని విధాలుగా రంగం సిద్దం చేసుకుని వచ్చారని కూడా వార్తలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా... ఆర్జీవీ కోయంబత్తూరులో ఉన్నారని.. ఆయన మోహన్ లాల్ తో ఉన్న  ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఏంజరుగుతుందో అని ఆర్జీవీ ఫ్యాన్స్ మాత్రం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.