Diamonds Found In Farms: రాయలసీమ రతనాల సీమ అనేది నిజమవుతున్నది. రాయలసీమలోని జిల్లాల్లో కనకపు రాశులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బంగారు గనుల తవ్వకానికి సీమలో ప్రభుత్వం అనుమతివ్వగా.. ఇప్పుడు అక్కడ ఏ రాయి రప్ప తీసుకున్నా కూడా అత్యంత విలువైన వజ్రాలు, రత్నాలుగా మారుతున్నాయి. సద్ది కట్టుకుని వెళ్లిన వారిని లక్షలాదికారులను చేస్తున్నాయి. ఇదంతా కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వేసవి తర్వాత కురుస్తున్న వర్షాలకు అక్కడి నేలపై ఉన్న రాళ్లు రసాయనం చెంది విలువైన వజ్రాలు, రత్నాలుగా మారుతుండడంతో అక్కడి స్థానికుల పంట పండుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 25 లక్షల విలువైన రాళ్లు కనిపించాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Statue Of Liberty: మారుమూల గ్రామానికి చేరిన ప్రపంచ వింత స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహం


 


కర్నూలు జిల్లా జొన్నగిరి, తుగ్గలి, మద్దికేర  మండలాల్లో బంగారు గనులు ఉన్నాయని గుర్తించిన విషయం తెలిసిందే. త్వరలోనే అక్కడ బంగారు తవ్వకాలు జరుగనున్నాయి. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో వజ్రాలు లభిస్తున్నాయి. అకాల వర్షాలకు అక్కడి నేలపై ఉన్న రాళ్లు వజ్రాలుగా మారి స్థానికులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఏకంగా రూ.2 కోట్ల విలువైన రాళ్లు లభించాయని సమాచారం. రెండు రోజుల వ్యవధిలో స్థానికులకు అత్యంత విలువైన రెండు వజ్రాలు లభించాయి. వజ్రాన్వే షణకు వెళ్లిన ఓ వ్యక్తికి దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.6.20 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. అంతేకాకుండా ఐదు తులాల బంగారం ఇచ్చాడు.

Also Read: Kavya Maran Crying: గుండెల్ని పిండేసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప


 


ఇక ఓ మహిళకు వజ్రం లభించగా మరో వ్యాపారి రూ.1.20 లక్షలు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ రకంగా చూస్తే దాదాపు రూ.25 లక్షల విలువైన బంగారు రాళ్లు లభించాయి. ప్రతియేటా వర్షాకాలం ప్రారంభంలో ఈ ప్రాంతంలో స్థానికులు వజ్రాన్వేషణ చేస్తుంటారు. జొన్నగిరి, తుగ్గలి,  మద్దికేర మండలాల్లో ప్రతి ఏటా ఏదో ఒక గ్రామంలో వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. ఈ వార్త తెలుసుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇక్కడ ప్రజలు వజ్రాలను వెతుకుతుంటారు.


కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మద్దికేర మండలం, మదనంతపురం గ్రామానికి చెందిన వ్యక్తి పొలం పనులు  చేస్తుండగా వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని రూ.5 లక్షలు, 3 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. అయితే ఆ రాయి విలువ  దాదాపు రూ.పది లక్షలు ఉంటుందని అంచనా. ఇలా స్థానికులు ఓ 15 రోజుల పాటు విలువైన వజ్రాలు, రాళ్ల కోసం అన్వేషణ చేస్తుంటారు. ఈ రాళ్ల అన్వేషణ కోసం ప్రజలు టిఫిన్‌ డబ్బా, నీళ్లు వెంట తెచ్చుకుంటారు. ఉదయం నుంచి చీకటి పడే దాకా అరుదైన రాళ్ల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. కాగా రాళ్లు లభించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook