పవన్ కల్యాణ్ కౌంటర్ ఎటాక్ : రాహుల్ బ్రహ్మచర్యాన్ని ప్రశ్నించిన జనసేనాని
రాహుల్ గాంధీ బ్రహ్మచర్యాన్ని లక్ష్యం చేసుకొని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వారు రాహుల్ బ్రహ్మచారని చెబుతున్నారు. లోపల ఏం జరుగుతోందో ఎవరికి తెలుసునని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచివి కావని.. వ్యక్తిగత జీవితాల ప్రభావం పరిపాలన శాసనాల నిర్దేశంపై ఉంటుందంటే తాను కూడా మాట్లాడగలనని పవన్ వ్యాఖ్యానించారు. తాను వ్యక్తిగత ఆరోపణలకు దిగితే అందరి బండారాలు బయటపడతాయని కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. ఇటీవలి కాలంలో నిత్యపెళ్ళికొడుకు అంటూ.. పవన్ వైవాహిక జీవితాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్లకు కౌంటర్ ఇచ్చే క్రమంలో పవన్ ఈ మేరకు పవన్ కల్యాణ్ స్పందించారు.