జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు ప్రభుత్వానికి మరో డెడ్ లైన్ విధించారు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల్లో దీనిపై వైద్య ఆరోగ్యశాఖ స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు.  ఈ వ్యవధిలో స్పందించకుంటే నిరాహార దీక్షకు దిగుతానని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివారాల్లో వెళ్లినట్లయితే బుధవారం ప్రజా పోరు యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని పవన్ డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ  కామినేని రాజీనామాతో ఏర్పడిన ఖాళీని వెంటనే భర్తీ చేయాలని.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని నియమించాలని ఈ సందర్భంగా పవన్ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ డిమాండ్లను పరిష్కరించడానికి చంద్రబాబు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నానని.. ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. 


తమ పార్టీ  లేవనెత్తిన సమస్యలను  చెప్పిన గడువులోగా ఏపీ సర్కార్ పరిష్కరించకపోతే యాత్రను ఆపేసి నిరాహారదీక్షకు దిగుతానన్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు చంద్రబాబు బాధ్యత వహించాలని పవన్ హెచ్చరించారు.  రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి లేకపోవడం సిగ్గు చేటని...కామినేనితో రాజీనామాతో ఖాళీ అయిన వైద్య ఆరోగ్యశాఖకు ఇప్పటి వరకు మంత్రిని నియమించకపోవడం సిగ్గు చేటన్నారు.