Ram Charan Wax Statue at madame tussauds: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు బొమ్మగా కొలువు తీరనున్న మెగా పవర్ స్టార్..

Ram Charan Wax Statue at madame tussauds: రామ్ చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

1 /5

చిరంజీవి కుమారుడి సినీ ఇండస్ట్రీలో అడుగపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయిన తీరుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఫిదా అయ్యారు.

2 /5

మొత్తంగా ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్‌ గ్లోబల్ స్టార్ గా తన కంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

3 /5

తాజాగా రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ వాళ్లు రామ్ చరణ్ కు సంబంధించిన మైనపు విగ్రహాన్ని  త్వరలో సింగపూర్ లో ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ వాళ్లకు తన శరీరానికి సంబంధించిన కొలతలను కూడా ఇచ్చాడు.

4 /5

దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి ఈ గౌరవం అందుకుంటున్న నాల్గో హీరోగా రామ్ చరణ్ రికార్డులకు ఎక్కాడు. మన సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి ముందుగా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బాహుబలి రూపంలో సింగపూర్ లో పెట్టారు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని పెట్టారు. రీసెంట్ గా లండన్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. త్వరలో రామ్ చరణ్ మైనపు విగ్రహం కొలువు తీరనుంది.

5 /5

రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీని  డిసెంబర్ 21న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు.