Pawan Kalyan Announced two Seats: తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ మిత్ర ధర్మ పాటించలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమను సంప్రదించకుండా.. ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అరకు, మండపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా.. పోటీ పవన్ కళ్యాణ్‌ కూడా రెండు స్థానాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేశారు. తనకు ఇష్టమైన అక్షరం ఆర్.. అని రిపబ్లిక్ డే సందర్భంగా రాజోల్, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. చంద్రబాబుకు ఉన్న ఒత్తిడితో అభ్యర్థులను ప్రకటించారని.. తనకు కూడా ఉన్న ఒత్తిడి కారణంగా ప్రత్యేక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే.. తనకూ పార్టీలో ఒత్తిడి ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్‌. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చన్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. లోకేష్‌ ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడినా మౌనంగా ఉన్నానని అన్నారు. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నామని.. అంతేకానీ బలం తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. పొత్తుల్లో భాగంగా ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నామని తెలిపారు. 


తమను సంప్రదించకుడా టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంపై తనను అడిగిన నాయకులు క్షమాపణలు చెప్పానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ కోసం 50 నుంచి 70 స్థానాలు తీసుకోవాలని తనకు తెలియనిది కాదన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు గెలుస్తామని.. అయితే అధికారంలోకి వస్తామోరామో తెలియదని చెప్పారు. పవన్‌ జనంలో తిరగడు.. వాస్తవాలు తెలియని కొందరు విమర్శిస్తున్నారని.. ఇవన్నీ తెలియకపోతే తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని అన్నారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్ట అని.. అదే విడదీయడం తేలికన్నారు. అందుకే తనకు నిర్మించడం ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. 


పొత్తుల్లో ఎన్ని స్థానాలు తీసుకోవాలని తనకు తెలుసన్నారు జనసేనాని. గత ఎన్నికల్లో 18 లక్షల ఓట్లు సాధించామని గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీతోపాటు జనసేనను కూడా వదలడం లేదన్నారు. సొంత చెల్లినే వదలని వ్యక్తి.. మిగిలిన వారిని వదులుతారా..? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు ఊరంతా శత్రవులేనని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు కష్టం వస్తే తన వద్దకు రావాలన్నారు. 


Also Read: KTR Viral Tweet: సంచలనం రేపుతోన్న కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్.. రాష్ట్రరాజకీయాల్లో తీవ్రచర్చ..!


Also Read: Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ మరోసారి ఎంప్లాయిస్ కు షాక్.. గేమింగ్ విభాగంలో భారీఎత్తున లేఆఫ్స్..   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook