KTR Viral Tweet: సంచలనం రేపుతోన్న కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్.. రాష్ట్రరాజకీయాల్లో తీవ్రచర్చ..!

KTR Viral Tweet: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. దానికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగానే జవాబు చెబుతోంది. ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో కేటీఆర్  కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్‌ తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ట్వీట్టర్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 12:09 PM IST
KTR Viral Tweet: సంచలనం రేపుతోన్న కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్.. రాష్ట్రరాజకీయాల్లో తీవ్రచర్చ..!

KTR Tweet: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. దానికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగానే జవాబు చెబుతోంది. ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో కేటీఆర్  కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్‌ తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అబద్ధాలను నమ్ముకుని నరేంద్ర మోదీ ప్రధానిగా, రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు' అని ఇటివల విమర్శించిన సంగతి తెలిసిందే. 420 హామీలపై నిలదీద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇచ్చిన హామీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్‌ కరెంట్ బిల్లులు కూడా కట్టొద్దని ప్రజలకు చెప్పారు. బిల్లులప్రతులను నేరుగా సోనియా ఇంటికే పోస్ట్ లో పంపాలని సూచించారు. ఇది ఇలా ఉండగా ఆయన ఈరోజు ట్వీట్టర్ వేధికగా ఓ సంచలన ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిగురించే అందరూ చర్చింకుంటున్నారు. ట్వీట్టర్ వేధికగా 'కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి..' అనే సుమతి శతకం పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే, కేటీఆర్ ఈ పద్యాన్ని ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేశారనే  రాష్ట్రరాజకీయ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి.ఈ పద్యం మనం చిన్నప్పుడు మన పాఠాల్లో చదువుకునే ఉన్నాం.కేటీఆర్ పోస్ట్ చేసిన పూర్తి పద్యంపై ఓ లుక్కేద్దాం..

కనకపు సింహసనమున 
శునకము గూర్చండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ

Also Read: Padma Awards 2024: పద్మ అవార్డుల్లో తెలుగు వెలుగులు.. చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మవిభూషణ్‌

పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాను పార్టీకి ప్రచారాస్త్రంగా వాడుకోవాలని సూచించారు. అన్ని విషయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం సోషల్‌ మీడియాలో విమర్శలను బలంగా తిప్పికొట్టకపోవడం కూడా ఒకటి అని కేటీఆర్‌ చెప్పారు.  

Also Read: Mahalakshmi Scheme: మహిళల ఖాతాల్లో ఆరోజే రూ.2,500 జమా.. మహాలక్ష్మి పథకంపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News