Pawan Kalyan Questions to CM YS Jagan: అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై పలు ఆరోపణస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు... ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో నెంబర్ 1 ని తీసుకొచ్చి ప్రజాపక్షం నిలిచిన ప్రతిపక్ష పార్టీల గొంతమూయించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ పై మండిపడ్డారు. ఇటువంటి జీవో గతంలోనే ఉండి ఉంటే జగన్ రెడ్డి నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా ? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తుచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను అక్టోబరులోనే విశాఖ నగరంలో చూపించారని చెబుతూ అక్టోబర్‌లో విశాఖలో జరిగిన ఘటనల గురించి పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తుచేసుకున్నారు. వాహనంలో నుంచి కనిపించకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు అని, హోటల్ నుంచి బయటకు రాకూడదు అని నిర్బంధాలు విధించారు. ఇప్పటం వెళ్లరాదని అటకాయించారు. అప్పుడు జీవో లేకుండానే చేసిన పనిని చేయడానికి ఇప్పుడు ఏకంగా జీవోనే తీసుకువచ్చారంటూ ఏపీ ప్రభుత్వం తీరుపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
   
అక్టోబర్‌లో చూపించిన పెడ పోకడలనే తాజాగా అక్షరాల్లో ఉంచి జీవో తీసుకొచ్చారు. ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కుప్పం పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా? ఈ ఉత్తర్వులు జగన్ రెడ్డికి వర్తిస్తాయా లేవా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి ఆయన చేసిన రోడ్ షో ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయో రావో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు ఏమని స్పందిస్తారో చూడాలి మరి.


ఇది కూడా చదవండి : Nagababu: ఏపీలో ఉన్నది ప్రభుత్వమా, రాచరిక పాలనా..జీవో నెంబర్ 1పై కోర్టుకు వెళ్తాం


ఇది కూడా చదవండి : AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్


ఇది కూడా చదవండి : AP Politics: ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో గుబులు.. ఎవరికి నష్టం..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook