తెలంగాణ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రోళ్లు దోచుకున్నారని..ఇష్టమోచ్చినట్లు ఆరోపించిన వారు ఇప్పుడు వారికే కాంట్రాక్టులు ఎందుకిచ్చారు ?... అప్పుడు దోచుకున్న వాళ్లు ..ఇప్పుడు నిజాయితీ పరులుగా మారిపోయారా ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఇలా దిగజారడం సిగ్గుచేటని పవన్ ఎద్దేవ చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కార్యకర్తలతో జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాసర ఐఐఐటీలో చదివే ఆంధ్రా విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వకుండా ఆపేశారు... ఇలా ఊహించగలమా? అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.