Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌  పొలిటికల్ ఇప్పుడు రూట్ మార్చినట్లు కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు ఒక రాజకీయపంథాను ఎంచుకున్న పవన్ కళ్యాణ్‌ తాజాగా సరికొత్త పంథాలో దూసుకెళ్లాలనుకుంటున్నారు. తిరుమల లడ్డు కల్తీవ్యవహారంతో పవన్ ఆలోచనలో పెద్ద మార్పే వచ్చింది. తిరుమల లడ్డు కల్తీ అంశం పవన్ ను మానసికంగా బాగా కలిచి వేసినట్లు ఉంది. దీంతో ఆయన ఏకంగా సనాతన ధర్మం  పరిరక్షణ అనే సరికొత్త ఎజెండాను ఎంచుకున్నట్లు కనపడుతుంది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం తాను ఏ త్యాగానికి ఐనా సిద్దమని పవన్ ప్రకటించడం ఇందులో భాగంగానే కనపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేన పార్టీ పెట్టిన దాదాపు దశాబ్దకాలం తర్వాత పవన్ కళ్యాన్‌ రాజకీయంగా మొన్నటి ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు. ఏకంగా 21 సీట్లలో పోటీకీ దిగి అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. వందకు వంద శాతం సక్సెస్ రేట్ తో ఎన్నికల్లో విజయం సాధించడం పవన్ కళ్యాణ్‌ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. దీంతో రాజకీయంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ఇక ముందు పని చేయాలనే ధోరణితో పవన్ పనిచేస్తున్నట్లు కనపడుతుంది. అందులో భాగంగా తాజాగా సనాతన ధర్మం పరిరక్షణ నినాదం ఎత్తుకున్నట్లుగా కనపడుతుంది. మొన్నటి ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్‌ ను ఒక సినిమా హీరోగా అందులోను ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా పవన్ ను ఏపీ ప్రజలు చూశారు. మొన్టని ఎన్నికల్లో ఈ కుల సమీకరణాలతో ఎన్నికలకు కూటమి వెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే పవన్ కు మాత్రం తనను ఒక సామాజికవర్గానికి ప్రతినిధిగా చూడడం ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తాను మెజార్టీ ప్రజల ప్రతినిధిగా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్‌ భావనగా తెలుస్తుంది.


అందులోభాగంగానే పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు మెజార్టీ హిందువుల పక్షాన నిలబడాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు తనకు కాపు ప్రతినిధిగా ఉన్న ముద్రను కూడా చెరిపివేసుకోవాలనుకుంటున్నాడట. భవిష్యత్తులో రాజకీయంగా  సుదీర్ఘ కాలం పాటు ఉండాలంటే కేవలం ఒక్క సామాజిక వర్గం అండ ఉంటే సరిపోదని..మెజార్టీ ప్రజల మద్దతు ఉండాలన్నదే పవన్ ఆలోచనట. అందుకే ఈ హిందూత్వ నినాదం ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హిందూత్ ఎజెండాతో వెళితే ఎక్కువ మంది ప్రజలు తమకు అండగా నిలబడుతారని పవన్ నమ్ముతున్నారు. అంతే కాదు మొన్నటి ఎన్నికల్లో విజయం రావడానికి  ప్రధాన పాత్ర పోషించింది  యువత. ఎలాగో తనకు సినిమా పరంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. యువతను అంతా కూడా పార్టీలో క్రియాశీలంగా పనిచేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. 


ప్రస్తుతం హిందూత్వ నినాదం యువతలో చాలా ఎమోషనను క్రియేట్ చేస్తుంది. తన ఫ్యాన్స్ అంతా కూడా యువతే ..వీరందరిలో ఒక పొలిటికల్ ఎమోషన్ క్రియేట్ చేసి దానిని రాజకీయంగా ఒక బలమైన శక్తిగా మారాలన్నదే పవన్ కళ్యాణ్‌ లక్ష్యంగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు పవన్ ఈ సనాతన ధర్మ పరిరక్షణ ఎజెండా ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది.అందుకే ఈ మధ్య పవన్ వ్యాఖ్యలో ఎక్కువగా ఒక మాట పదే పదే వినిపిస్తుంది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువూ ఏకం కావాలని పదే పదే పిలుపునివ్వడాన్ని ఆ కోణంలోనే చూడాలన్నది రాజకీయ పరిశీలకుల మాట. తాజాగా ఆ దేవదేవుడు కొలువైన పవిత్ర స్థలంలో పవన్ నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభ అందులో భాగమే. ఈ వారాహి సభ అంతా కూడా హిందూవుల పునరేకీకరణ కోసమే జరిగినట్లుగా భావించవచ్చు. 


ఐతే పవన్ ఉన్నట్లుండి తన పంథాను మార్చడం వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌  బీజేపీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. మొన్నటి కూటమి గెలుపు తర్వాత పవన్ పై బీజేపీ పెద్దలకు మరింత విశ్వాసం ఏర్పడింది. పవన్ తో రాజకీయంగా కలిసి ఉంటే ఏపీలో రాజకీయంగా బలపడవచ్చు అనేది   బీజేపీ వ్యూహంగా తెలుస్తుంది. అందుకే  తమ మూల సిద్దాంతం ఐనా హిందూత్వ వైపు పవన్ ను బీజేపీ డ్రైవ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తులో పవన్, బీజేపీ మరింత ధృఢంగా కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.


ప్రస్తుతానికి కూటమిలో టీడీపీ ఉన్నా..గత అనుభవాల దృష్ట్యా బీజేపీ పెద్దలు ప్రత్యామ్నాయ ఆలోచనల్లో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేని పరిస్థితుల్లో టీడీపీ కూటమి నుంచి వెళ్లినా జనసేన.బీజేపీ రెండు కలిసి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా తయారుకావడానికి సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే పవన్ ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ నినాదం ఎంచుకున్నారా అన్న చర్చ జరుగుతుంది.


మొత్తానిక పవన్ కళ్యాణ్‌ సరి కొత్త రాజకీయ నినాదం ఎత్తుకున్నారు. పవన్ ఎంచుకున్న ఈ ఎజెండా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుంది. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ ఎజెండాత ఏ పార్టీకీ రాజకీయంగా నష్టం జరుగుతుంది.  పవన్ రాజకీయ నిర్ణయంపై టీడీపీ ఎలా స్పందిస్తుంది..పవన్ నిర్ణయం టీడీపీకీ రాజకీయంగా లాభమా, నష్టమా అన్నది కూడా భవిష్యత్తుల్లోనే తేలనుంది.


ఇదీ చదవండి:  రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.