Pawan Kalyan Maharastra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.  ఇప్పటికే ఎన్టీయే కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. మొత్తంగా 222 స్థానాల్లో ఎన్టీయే కూటమిలోని మహాయుతి సభ్యులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు 55 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని  ఇండి కూటమి నేతలు  లీడింగ్ లో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ అధిక్యంలో కొనసగుతోంది. ఇప్పటికే పూణే, బల్లార్ పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ లలో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఇందులో పుణే, బల్లార్ పూర్, షోలాపూర్ లలో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన స్థానాల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా సాగుతోంది.


దీంతో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరపతి కేవలం  తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. పక్కనున్న మహారాష్ట్రకు కూడా పాకింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన నేతగా దేశ వ్యాప్తంగా మెజారిటీ హిందువులకు చేరువ అయ్యాడు. అంతేకాదు వేరే మతుస్తులకు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే తానే ముందుండి పోరాడుతాననన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంచి క్రేజ్ ఏర్పడింది.  ఇక తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేకాదు దక్షిణాది యోగిగా పవ్ కళ్యాణ్ ను అభివర్ణిస్తున్నారు.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter