Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికీ దారేది సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడా తగ్గాలో తెలిసిన వాడే అసలు సిసలు నాయకుడు అన్నట్టు.. పొలిటికల్ గా రియల్  హీరోగా నిలిచారు పవర్ స్టార్ పనన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక వైసీపీ ఓటు చీలనివ్వను అంటూ మంగమ్మ శపథం చేసి పంతం నెగ్గించుకున్నారు జనసేనాని. అంతేకాదు ఏపీలో పొత్తులో 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసారు. అంతేకాదు దేశ రాజకీయాల్లో పోటీ అన్ని స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేసారు. మరోవైపు జనసేన అధినేత 2009లో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం లో యువరాజ్యం అధినేతగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచారు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీ స్థాపించి.. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత కనీసం ఏ పదవి తీసుకోకుండా అన్నింటిని త్యాగం చేసారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టకొన్నాడు. ఆ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక సీటుకే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కట్ చేస్తే 2024లో చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా తెలుగు దేశం పార్టీకి సంఘీభావం ప్రకటించి ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశంల కోసం తన సీట్లను త్యాగం చేశారు. అది ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను చూపించింది. అంతేకాదు అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యేలా చేసింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసారు. అంతేకాదు ఏపీలో తెలుగు దేశం పార్టీ తర్వాత 21 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.


ఈ ఎన్నికల్లో వైసీపీ గద్దె దిగడానికి.. తెలుగు దేశం పార్టీ సుప్రీమో.. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణమే చెప్పాలి. మరోవైపు కేంద్రంలో బీజేపీకి ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అక్కడి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. కేవలం మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనే బీజేపీ అద్బుత ప్రదర్శన చేసింది. అంతేకాదు మెజారిటీకి సగం సీట్లైన 272కు 31 సీట్ల తక్కువగా 241 సీట్ల దగ్గరలోనే ఆగిపోయింది. కేవలం మిత్రపక్షాలతో కలిపి 292 సీట్లు సాధించింది. ఒక రకంగా కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలే కీలకంగా వ్యవహరించారు. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర లేకుంటే మోదీ తిరిగి ప్రధాని పీఠం ఎక్కడం అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పాటు.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడానికి ఏపీలో పవన్ కళ్యాణ్ చేసిన కృషినే కీలకం అని చెప్పాలి. ఓ రకంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో అసలుసిసలు గేమ్ ఛేంచర్ గా నిలిచారు.


Also read: AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook