Camphor: కర్పూరం బిల్లతో లాభాలెన్నో .. ఒళ్లు నొప్పులు మాయం!!

Camphor Benefits For Bathing:  కర్పూరం కేవలం పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, అందాన్నికి  కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు గురిచి పూర్తిగా తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 1, 2024, 10:46 AM IST
Camphor: కర్పూరం బిల్లతో లాభాలెన్నో .. ఒళ్లు నొప్పులు మాయం!!

Camphor Benefits For Bathing: కర్పూరం బిల్ల అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పూజలు చేసేటప్పుడు హారతి కోసం ఉపయోగించే పదార్థం. దీని సువాసన మనసును ప్రశాంతం చేస్తుంది. అయితే ఇది కేవలం పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, అందాన్నికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కర్పూరం ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. 

కర్పూరం బిల్ల అంటే ఏమిటి?

 కర్పూరం బిల్ల ఒక సేంద్రీయ సమ్మేళనం. దీనిని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుంచి సింథసైజ్ చేసి తయారు చేస్తారు. ఇది ఎన్నో రకాలుగా లభిస్తుంది. దీని ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించవచ్చు. తీవ్రమైన నొప్పులతో బాధపడేవారు కర్పూరంను ఉపయోగించి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల, నరాల సంబంధమైన సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొంతమంది శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. వీరు కర్పూరం ఉపయెగించడం వల్ల యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. ఇది శ్వాస మార్గాలను శుభ్రపరచి, శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొందరు కాటుకలో దీని ఉపయోగిస్తారు. మైగ్రేన్‌ సమస్యతో బాధపడేవారు కర్పూరం ఉపయోగించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. 

కర్పూరం కేవలం ఆరోగ్య సమస్యలకు మాత్రమే కాకుండా అందాన్నికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంపై కలిగే మొటిమలను, మచ్చలను తొలగించడం సహాయపడుతుంది. బ్యాక్టీరియాను నాశనం చేసే  గుణాన్ని కూడా కర్పూరానికి ఉంటుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు కూడా కర్పూరను ఉపయోగిచడం వల్ల మంచి నిద్ర కలుగుతుంది. మనోధైర్యాన్ని పెంచడంలో కూడా కర్పూరం సహాయపడుతుంది. అంతేకాకుండా కాలుష్యాన్ని పొగట్టి మంచి శుభ్రమైన వాతావరణాన్ని మార్చడంలో కూడా కర్పూరం ఉపయోగపడుతుంది. దోమలను దూరం చేయడంలో కర్పూరం సహాయపడుతుంది. 

పచ్చ కర్పూరం: దీని ఎక్కువగా ఔషధ ప్రయోగాలకు ఉపయోగిస్తారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. పచ్చ కర్పూరంను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఎక్కువగా ఉంటాయి. 

హారతి కర్పూరం: సాధారణంగా దీని మనం ఇంట్లో ఉపయోగిస్తాము. ఇది పూజ కోసం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మనసు ప్రశాంతంతగా ఉంటుంది. 

భీమసేని కర్పూరం: ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతారు. కొన్ని రకమైన ఔషధాల కోసం దీని ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యమైన విషయాలు:

కర్పూరాన్ని అధికంగా ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు కలగవచ్చు, చిన్న పిల్లలు, గర్భవతులు, చర్మం సున్నితంగా ఉండే వారు కర్పూరాన్ని ఉపయోగించే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

Also read: Buttermilk Hidden Facts: రోజు మజ్జిగ తాగితే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News