Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్ కల్యాణ్
Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
Pawan Kalyan Rayalaseema: గ్రామాభివృద్ధి కోసం చేయాలనే విషయంలో గ్రామసభ చాలా ముఖ్యమని.. రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదని తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామని చెప్పారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని పేర్కొన్నారు. 'స్వర్ణ గ్రామ పంచాయతీ' పేరిట నిర్వహిస్తున్న గ్రామ సభలను శుక్రవారం పవన్ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లెలో పర్యటించారు.
Also Read: YS Jagan: తొలిసారి జగన్ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి
గ్రామసభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాయలసీమలో ఎందుకు గొడవలు జరగాలి. సీమలో అభివృద్ధి జరగాలన్నదే నా లక్ష్యం. సీమ ప్రజల కోసం కూలిగా పనిచేస్తా. వారికి కష్టమొస్తే అండగా ఉంటా. పదవి నాకు అలంకారం కాదు. బాధ్యతగా ఉంటా. నాకు ప్రజాభిమానం ప్రజా బలం ఉంది. కానీ పరిపాలన అనుభవం లేదు' అని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. 'చంద్రబాబు మంచి ఆర్ధికవేత్త. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు అవసరమని చాలాసార్లు చెప్పా. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే' అని స్పష్టం చేశారు.
Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు
ఇసుక దోపిడీదారుల వల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ జలప్రలయానికి కారణమని డిప్యూటీ సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతీ పంచాయతీకి ఆస్తులు ఉండాలన్నదే నా అభిమతమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఏమై పోయాయని ప్రశ్నించారు. గ్రామానికి ఆస్తులు ఏమున్నాయని సందేహం వ్యక్తం చేశారు. 'గ్రామానికి మౌలిక వసతులు సమాకుర్చుకోవడం ఆస్తులు కావాలి. దాతల సహకారంతో మైసూరావారి పల్లికి ఆట స్థలం ఏర్పాటు చేస్తా. రైల్వే కోడూరును పండ్ల రాజధాని చేస్తా.. నేనే పర్యవేక్షిస్తా' అని వివరించారు.
'గ్రామాభివృద్ధి మీ చేతుల్లో ఉంది. గ్రామ ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం. నాలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా మీలో చైతన్యం వచ్చే వరకూ ఏమి చేయలేము' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సీమలో వలసల నిలుపుదల కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రకటించారు. అరటి పంటకు బీమా అమలయ్యేలా చేస్తానని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter