Pawan Kalyan Warns AP Govt: రౌడీలు రాజ్యాలు ఏలకూడదన్న పవన్ కల్యాణ్.. రౌడీల పాలనకు, అక్రమ నిర్భందాలకు జనసేన పార్టీ భయపడదని స్పష్టంచేశారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే భయంతోనే జనవాణిని అడ్డుకున్నారని అన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖ నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భయపడేదే లేదు..
తనకు నచ్చని వాళ్లు ఉండకూడదు.. బతక్కూడదు అంటే కుదరదు. ప్రజాస్వామ్యం విలువలను మనం కాపాడుకోవాలి. అక్రమ కేసులకు, నిర్భందాలకు భయపడేది లేదు. సమిష్టిగా చేసే బలమైన పోరాటాలే సరైన మార్గంగా నిలుస్తాయని పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుకు హితవు పలికారు. 


అందుకే రాజకీయాల్లోకి వచ్చాను..
నా పిల్లలకు మంచి చదువు, డబ్బులు అందివ్వగలను.. కానీ వారు బతికేందుకు మంచి సమాజాన్ని తీసుకురావాలంటే నా వంతుగా నేనేం చేయాలి అనుకున్నాను. సమాజంలో మార్పు తీసుకురావాలని అనుకున్నాను. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. నా ఒక్కడి వల్లే సమాజం మారడం కుదరదు కనుక జనసేన పార్టీ ద్వారా నాలా ఆలోచించే ఒక కుటుంబాన్ని తయారు చేశాను. జనసేన సమూహమంతా నా కుటుంబమే. ఈ ప్రజలంతా నా వాళ్ళే అనుకుంటా  అని పవన్ కల్యాణ్ తెలిపారు.


అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నంత మాత్రాన్నే వారికి రాజ్యాంగం వర్తించదా ? వారికి సంస్కారం ఉండక్కర్లేదా అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారానికి బదులుగా ఏం మాట్లాడతారో అని భయపడే స్థాయికి పరిస్థితి దిగజారిందని.. గట్టిగా మాట్లాడితే ప్రభుత్వ పథకాలు నిలిపేస్తారనే భయం, ప్రశ్నిస్తే కేసులు పెడతారేమోననే భయం, గట్టిగా విమర్శిస్తే రాత్రికి రాత్రే ఏం చేస్తారోననే భయపడే స్థాయికి ఏపీలో పరిస్థితులు దిగజారాయని ఆందోళన వ్యక్తం చేశారు. 


జనవాణి కార్యక్రమం అంటేనే ప్రభుత్వం భయపడుతోంది..
ప్రభుత్వానికి జనసేన పార్టీ తలపెట్టిన జనవాణి అంటేనే భయమేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటికొస్తాయోననే భయంతోనే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతోంది. అందులో భాగంగానే ఆరోజు ఒక ఐపీఎస్ స్థాయి అధికారి పదే పదే నా వాహనంపైకి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంత మంది జన సమూహం ముందు ఆరోజు నేను ఏ మాత్రం ఆవేశపడినా పరిస్థితి చేయిదాటిపోతుంది. ప్రభుత్వం కోరుకునేది కూడా అదే. అందుకే సహనంతో ఓపిక పట్టాను అంటూ విశాఖలో ఇటీవల జరిగిన ఘటనను పవన్ కల్యాణ్ మరోసారి గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రతీ పోరాటంలో తన ఆశయాలతో కలిసి అడుగేస్తూ, తనకు అండగా నిలుస్తున్న జనసైనికులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాటం చేద్దామని పవన్ కల్యాణ్ జన సైనికులకు పిలుపునిచ్చారు.


Also Read : MP Raghu Rama Krishnam Raju: ఆర్జీవీ 'వ్యూహం' మూవీకి కౌంటర్.. గండ్ర గడ్డలి, కోడి కత్తి సినిమాలు వస్తాయి: ఎంపీ రఘురామ


Also Read : Nagababu Birthday: మా చిన్నన్నయ్య ధృడంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు ప్రత్యేక స్థానం: పవన్ కళ్యాణ్‌


Also Read : Aarogyasri in AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆరోగ్యశ్రీలోకి మరో 809 చికిత్సలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి